Case Registered For Kicking Vijay Sethupathi at bangalore airport - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తన్నమని రివార్డు.. వ్యక్తిపై కేసు నమోదు

Nov 19 2021 5:07 PM | Updated on Nov 19 2021 5:27 PM

Claimed Reward For Kicking Vijay Sethupathi And Case Registered - Sakshi

Claimed Reward For Kicking Vijay Sethupathi And Case Registered: విజయ్‌ సేతుపతి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన చిత్రంలో విలనిజంతో ఎంతగా ఆకట్టుకున్నారో చెప్పనవసరం లేదు. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున‍్నారు విజయ్‌ సేతుపతి. ఆయన్ను అభిమానులు మక్కల్‌ సెల్వన్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. అంత గొప్ప నటుడికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు ఎయిర్‌ పోర్టులో మహాత్మగాంధీ అనే వ‍్యక‍్తి విజయ్‌ సేతుపతిని వెనుక నుంచి వచ‍్చి దాడి చేశాడు. ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా కూడా మారింది. 

అయితే విజయ్‌ సేతుపతిపై అలా దాడి చేయమని ఓ వ‍్యక్తి రివార్డు ప్రకటించాడు. విజయ్‌ను తన్నిన వారికి ప్రతీసారీ రూ. 1001 బహుమతిగా చెల్లిస్తానని హిందూ మక్కల్‌ కట్చి నాయకుడు అర్జున్‌ సంపత్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించాడు. ఈ విషయంపై పోలీసులు నవంబర్‌ 17న అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 504, సెక్షన్‌ 506(1) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస‍్తున్నామని పోలీసులు ప్రకటించారు. 'స్వాతంత్య సమరయోధుడైన ముత్తు రామలింగం తేవర్‌'ను విజయ్‌ సేతుపతి అవమానించినందుకే రివార్డు ఇస్తానని ట్విటర్‌లో పోస్ట్‌ చేసినట్లు అర్జున్‌ తెలిపాడు. 

విజయ్‌ సేతుపతి చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నా అతనిపై దాడి జరిగింది. అనంతరం ఎయిర్‌ పోర్టు ఘటనపై 'విమానంలో నాకు అగంతకుడికి మధ్య చిన్న చర్చ జరిగింది. నాపై దాడి జరిగే సమయంలో అతను తాగి ఉన్నాడు. ఇలాంటి చిన్న విషయాల గురించి పట్టించుకోనవసరం లేదు' అని మక్కల్‌ సెల్వన్‌ పేర్కొన్నారు. 

చదవండి: ఎయిర్‌పోర్టులో విజయ్‌ సేతుపతిపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement