Choreographer Radhika Guinness Record - Sakshi
Sakshi News home page

Radhika: గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్న లేడీ కొరియోగ్రఫర్‌

Dec 19 2021 8:52 AM | Updated on Dec 19 2021 10:21 AM

Choreograper Radhika Guinness Record - Sakshi

Choreographer Radhika Guinness Record: ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు రాధిక గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఏఎంఎస్‌ ఫైన్‌ఆర్ట్స్‌ సంస్థ నిర్వాహకుడు, సమాజ సేవకుడు డాక్టర్‌ ఆర్‌.జె.రామనారాయణన్‌ నాట్యకళలను ప్రోత్సహించే విధంగా వాటిపై అవగాహన కలిగించే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సినీ నృత్య దర్శకురాలు రాధిక బృందం నేతృత్వంలో చెన్నైలోని పలు వేదికలపైనా, అదే విధంగా ఆన్‌లైన్‌ ద్వారా రోజూ గంట చొప్పున 365 రోజులు నాట్యకళ వేడుకలను నిర్వహించారు.

ఇందులో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు. కాగా చివరిరోజున 600 మంది నాట్య కళాకారులతో నిర్వహించిన నాట్యకళ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌లో నమోదైంది. న్యాయమూర్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ రికార్డ్‌ బుక్‌ నిర్వాహకులు ఆన్‌లైన్‌ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి అతిథిగా పాల్గొని నాట్య కళాకారులను అభినందించడంతో పాటు గిన్నిస్‌ రికార్డ్‌ ధ్రువపత్రాన్ని నృత్య దర్శకురాలు రాధికకు ప్రదానం చేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement