Chor Bazaar: నూనుగు మీసాల పోరడు.. నామీద నజరేసిండే సాంగ్‌ విన్నారా?

Chor Bazaar: Noonugu Meesala Lyrical Song Out Now - Sakshi

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న "చోర్ బజార్" నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.

హీరోయిన్ పాడుకునే సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది. "నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే, రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాచిండే, వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో, వాణ్ని చేరితే చాలయ్యో, మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో" అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా...కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు.

చదవండి: జవాన్‌ మూవీ.. మాస్‌ లుక్‌లో షారుక్‌ ఖాన్‌
 బిగ్‌బాస్‌ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top