Vijay Devarakonda Shares Most Romantic Scene With Samantha From Kushi Movie - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: విజయ్- సమంత కెమిస్ట్రీ అదుర్స్.. రొమాంటిక్ సీన్‌ షేర్ చేసిన హీరో!

Jul 19 2023 7:08 PM | Updated on Jul 19 2023 7:18 PM

Vijay Devarakonda Shares Most Raomantic Scene With Samantha From Khushi - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముగిసింది. ఇ‍ప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్లకి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయికతే ఇటీవలే ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌కు సైతం మంచి క్రేజ్ దక్కించుకుంది.

అయితే సాంగ్‌లోని ఓ సీన్‌ను విజయ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పాటలోని మోస్ట్ రొమాంటిక్‌ క్లిప్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా 'మన ప్రేమ అంటే ఇలానే ఉంటుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఖుషీ చిత్రంలోని రెండో పాట'ఆరాధ్య.. నా ఆరాధ్య.. నువ్వే లేనిదీ ఏది వద్దు ఆరాధ్య' అంటూ సాగే పాటను తెలుగు వెర్షన్‌లో రాశారు. తమి ళంలో మదన్‌ కార్కీ సాహిత్యమందించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement