
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఏపీలోని విజయవాడలో తంగలాన్ చిత్రబృందం సందడి చేసింది. బెజవాడ గాంధీనగర్‌లోని ఫేమస్ అయిన బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశారు. దీంతో సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. హీరో విక్రమ్, మాళవికతో పాటు నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్లకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
#Thangalaan 💥
Chiyaan at Vijaywada's Babai Hotel for Breakfast!
pic.twitter.com/ID4sppnPSJ— Christopher Kanagaraj (@Chrissuccess) August 12, 2024