
అలాగే తండ్రి ఫోటోకు పూలమాల వేసి దీపం మ్టుటిస్తున్న ఫోటోను సైతం పంచుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు సంవత్సరీకం నేడు(డిసెంబర్ 24). ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు చిరు. మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ.. అని రాసి గతంలో తండ్రితో దిగిన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు.
అలాగే తండ్రి ఫోటోకు పూలమాల వేసి దీపం వెలిగిస్తున్న ఫోటోను సైతం పంచుకున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 24, 2022
అవగాహన పంచి,
మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన
మా తండ్రి వెంకట్రావు గారిని
ఆయన సంవత్సరీకం సందర్బంగా
స్మరించుకుంటూ .. pic.twitter.com/epHicHCxbc
చదవండి: 2023లో నేను తీసుకోబోయే నిర్ణయం అదే: అల్లు స్నేహారెడ్డి
భర్తతో బయటికొచ్చిన నయన్‌పై ట్రోలింగ్, చిన్మయి ఫైర్