Allu Sneha Reddy About New Year Resolution of 2023 - Sakshi
Sakshi News home page

Allu Sneha: రాబోయే ఏడాది కొత్త నిర్ణయం తీసుకుంటున్న బన్నీ భార్య

Dec 24 2022 6:05 PM | Updated on Dec 24 2022 6:49 PM

Allu Sneha Reddy About New Year Resolution of 2023 - Sakshi

ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటన్న ప్రశ్నకు బిర్యానీ ఫోటో షేర్‌ చేస్తూ ఇండియన్‌ వంటకాలంటే మహా ఇష్టమని పేర్కొంది. మీకు ఉదయం అంటే ఇష్టమా? రాత్రి అంటే ఇష్టమా? అని అడగ్గా

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కే కాదు ఆయన సతీమణి స్నేహా రెడ్డికి కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 8.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీ ఫోటోలు, కూతురు అర్హ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. అంతేగాక హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజైనర్‌ డ్రెస్సుల్లో ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించింది.

రాబోయే ఏడాదిలో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా? అని ఓ అభిమాని ప్రశ్న విసిరాడు. ఇందుకామె స్పందిస్తూ.. అవాన్‌తో కలిసి కిచెన్‌లో బాగా వంట చేయాలనుకుంటున్నాను అని బదులిచ్చింది. ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటన్న ప్రశ్నకు బిర్యానీ ఫోటో షేర్‌ చేస్తూ ఇండియన్‌ వంటకాలంటే మహా ఇష్టమని పేర్కొంది. మీకు ఉదయం అంటే ఇష్టమా? రాత్రి అంటే ఇష్టమా? అని అడగ్గా వేకువజాము వేళలే ఇష్టమని తెలిపింది. బన్నీగారు మీకు ఏదైనా నిక్‌నేమ్‌ పెట్టారా? ఏమని పిలుస్తారు? అన్న క్వశ్చన్‌కు క్యూటీ అని పిలుస్తాడని ఆన్సరిచ్చింది స్నేహా.

చదవండి: గర్భం దాల్చాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement