భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి

Chiranjeevi plants saplings as he takes up the Green India - Sakshi

‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ అంటూ మొక్కలు నాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దూసుకెళుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. ఈ కరోనా సమయంలో అందరికీ ప్రాణవాయువు విలువ తెలిసింది. ఈ భూమి తల్లికి కూడా వృక్షాలు, అడవులు ప్రాణవాయువు అందిస్తాయి’’ అని నటుడు చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ మరియు జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి హీరోలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మనం ఇచ్చే కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని సంతోష్‌గారు గుర్తించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top