నో బ్రేక్‌ అంటున్న చిరంజీవి

Chiranjeevi Hectic Shooting Schedules For Four Films - Sakshi

‘ఆచార్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలోపు తర్వాతి సినిమా చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నారు చిరంజీవి. మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌లో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారట చిత్రదర్శకుడు మోహన్‌ రాజా. ఈ సినిమా కాకుండా బాబీ, మెహర్‌ రమేష్‌ దర్శకత్వాల్లో కూడా చిరంజీవి హీరోగా సినిమాలు తెరకెక్కనున్నాయి. సెట్స్‌లో ఒక సినిమా, కమిట్‌ అయిన మూడు సినిమాలతో చిరంజీవి బ్రేక్‌ లేకుండా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారని ఊహించవచ్చు.

చదవండి: యాంకర్‌ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top