Chiranjeevi Special Costly Gift To His Daughter Sreeja, Details Here - Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్‌తో కూతురు శ్రీజకి చిరు కాస్ట్లీ గిఫ్ట్‌.. ఎన్ని కోట్లంటే..!

Jan 4 2023 11:12 AM | Updated on Jan 4 2023 11:32 AM

Chiranjeevi Costly Gift To His Daughter Sreeja - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవికి కుటుంబం అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఖాలీ సమయం దొరికితే చాలు.. ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. కొడుకు కూతుళ్లతో పాటు మనవరాళ్లను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ముఖ్యంగా చిన్న కూతురు శ్రీజ అంటే మెగాస్టార్‌కు చాలా ఇష్టం. ఆమె ఏం అడిగినా వెంటనే కాదనకుండా చేసేస్తాడట.

తాజాగా తన చిన్న కూతురు శ్రీజకు మెగాస్టార్‌  ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. రూ. 35 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని కూతురికి కొనిచ్చాడట. ఆ ఇంటిని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో   కొనుగోలు చేశారని సమాచారం. ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయట. తాను చేసిన, చేయబోతున్న సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో ఈ ఇంటిని కొన్నారట. 

చిరు ప్రస్తుతం అనిల్‌ సుంకర, మైత్రీ మూవీస్‌లతో భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంతో పాటు చేయబోతున్న సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లతో ఆ ఇంటిని కొనుగోలు చేశారట. రూ.35 కోట్లు అంటే చిరంజీవికి చిన్న విషయమే కానీ.. విన్నవారికి మాత్రం ఇది చాలా పెద్ద విషయమే. 

(చదవండి:  'నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశాను'.. శ్రీజ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌)

ఇక శ్రీజ విషయానికొస్తే.. ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్‌ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement