‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు | Chiranjeevi Comments On On RRR Movie Trailer | Sakshi
Sakshi News home page

Chiranjeevi On RRR Movie Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Dec 9 2021 5:36 PM | Updated on Dec 9 2021 6:16 PM

Chiranjeevi Comments On On RRR Movie Trailer - Sakshi

Chiranjeevi Interesting Comments On RRR Movie Trailer: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఈ ట్రైలర్‌పై సామాన్యుల నుంచి సెలబ్రెటీలు వరకు స్పందిస్తున్నారు.

చదవండి: RRR Movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ అదరహో..యాక్షన్‌ సీక్వెన్స్‌ సూపర్బ్‌!

మతిపోతోంది రాజమౌళి సార్‌ అంటూ సెలబ్రెటీలంతా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి సైతం తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌పై స్పందించాడు. రామ్‌ చరణ్‌ షేర్‌ చేసిన ట్రైలర్ పోస్ట్‌పై చిరంజీవి వెంటనే రీట్విట్‌ చేస్తూ.. ‘ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించింది.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటాను’ అంటూ ఆసక్తికర కామెంట్‌ చేశాడు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ  2022 జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement