ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్‌ | Chiranjeevi And Jr NTR Reacted On Pahalgam Incident, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్‌

Apr 23 2025 8:30 AM | Updated on Apr 23 2025 1:14 PM

Chiranjeevi And Tollywood Celebrities React On Pahalgam Issue

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై సినీ హీరో చిరంజీవి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో దుండగులు అతి సమీపం నుంచి  తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇప్పటికి 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఈ హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య అంటూ చిరంజీవి సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్య. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైనది. ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయింది. మరణించిన వారి కుటుంబాలకు బరువెక్కిన హృదయంతో సానుభూతి తెలియజేస్తున్న. ఆ  కలిగిన నష్టాన్ని ఏదీ పూడ్చలేదు. - చిరంజీవి

పహల్గాం దాడి గురించి తెలిసి నా గుండె ముక్కలైంది. బాధితుల కుటుంబాలందరికీ, వారి బంధువులందరికీ నా సానుభూతి తెలియచేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నిజంగా ఈ దుర్ఘటన హృదయ విదారకం. - అల్లు అర్జున్

పహల్గామ్‌ దాడిలో మరణించిన వారిని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. ఇప్పడు నా ఆలోచనలు అన్నీ ఆ కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆపై వారి కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను. - ఎన్టీఆర్‌   

 

 ఇది చీకటి రోజు... పహల్గామ్‌లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను.ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను..ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు మరియు ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి- మహేశ్‌ బాబు

మూడు నెలల క్రితం మేము అక్కడే ఉన్నాము. దాదాపు 20 రోజుల పాటు 200 మందికి పైగా అక్కడే గడిపాం.  పహల్గాం  ఒక కలలా ఉంది. ఆ ప్రదేశం మాదిరే అక్కడి ప్రజలను కూడా మరిచిపోలేం. ఈ ఘటన గురించి తలుచుకుంటే హృదయం విరిగిపోయింది. పంచుకునేందుకు మాటలు కూడా రావడం లేదు. -నాని

రెండేళ్ల క్రితం పహల్గాంలో నా సినిమా షూటింగ్‌ అక్కడే జరిగింది.  షూటింగ్ సమయంలో కాశ్మీరీ స్నేహితులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వారి మధ్య నా పుట్టినరోజు జరుపుకున్నాను. నిన్న జరిగినది హృదయ విదారకం ఘటన నాకు కోపం తెప్పించింది.   తుపాకుల వెనుక దాక్కున్న ఈ ఉగ్రవాదం ఇలా పర్యాటకులను కాల్చడం  అత్యంత సిగ్గుచేటు, పిరికితనం. బాధితులకు, వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. కాశ్మీర్‌కు మేము  ఎప్పటికీ అండగా నిలుస్తాము. ఎప్పటికైనా సరే ఈ పిరికివాళ్ళను నిర్మూలిస్తారని నేను ఆశిస్తున్నాను. నా భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదు. - విజయ్‌ దేవరకొండ

Advertisement
 
Advertisement
Advertisement