చిరు బర్త్‌డే కానుకగా ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్!

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ టీం అభిమానులకు ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. ‘బాస్’ మూవీ అప్‌డేట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం.. ఆగష్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనుంది. కాగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 152వ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ లో హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలోనూ కథానాయికగా కనిపించనున్నారు. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు)
ఇక దాదాపు సగం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటం సహా షూటింగ్‌లకు అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి