‘ఇంతకు ముందెన్నడూ చూడని క్లైమాక్స్‌ సీన్స్‌ చూస్తారు’

Cheruvaina Dooramaina Movie Hero Sujith Reddy About His Movie Offer - Sakshi

Cheruvaina Dooramaina: వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన... దూరమైన’. ఈ మూవీతో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. తరుణి సింగ్ హీరోయిన్.  సుకుమార్ పమ్మి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుజిత్ మాట్లాడుతూ సినిమా విశేషాల గురించి ముచ్చటించాడు.

‘నేను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ తీసుకున్నానను.  మామయ్య శ్రీనివాసరెడ్డి కూడా సినిమాల్లో వుండటంతో బహుశా ఆ బ్లడ్ నాలో కూడా వుండటంతో నటనపై ఆసక్తి ఏర్పడింది అనుకుంట. నాకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం.ఈ చిత్రంలో క్లైమాక్స్ ప్రధానం. మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్స్‌పై సందేహాలు వచ్చాయి. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని అందరూ అన్నారు. కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు. మా సినిమాలో మ్యూజిక్ బాగుంది. అన్ని పాటటు బాగా వచ్చాయి. ఇందులో క్లైమాక్స్ ఏ సినిమాలో వుండదు. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సీన్‌ను కాకినాడ ఉప్పాడ బీచ్‌లో తీశాం. చాలా బాగా వచ్చింది. ఇందులో తమిళ నటుడు శశి ప్రతినాయకుడుగా చాలా బాగా చేశాడు. మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన, బ్రదర్ పాత్రలో తమిళ నటుడు శశి నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు.

ఎనిమిదేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా...
హీరోగా నటించాలనే ఫ్యాషన్‌తో ఆఫీసుల చుట్టూ తిరిగేవాడినని చెప్పాడు.  ‘చాలా మంది ‘ఎందుకు నీవు ఆఫీసుల చుట్టూ తిరగడం.. మీ మావయ్య అనుకుంటే... పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు కదా. ఎందుకంత కష్టపడుతున్నావు’ అనే వాళ్లు. కానీ నేనే సొంతంగా రాణించాలి.. నేనే నిర్మాతలని, దర్శకులను మెప్పించి సినిమా చేయాలని అనేవాడిని. ఈ క్రమంలో చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు. హీరో కావాలంటే బాగా స్లిమ్ అవ్వాలి చెప్పారు. అయితే నేను బాగా ఫ్యాట్‌ ఉండేవాడిని. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా. ఫస్ట్ నా మీద ఓ ట్రయల్ షూట్ చేశారు. దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే  అన్నారు.  దాంతో ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది. కొత్తవాడినైనా నిర్మాతలు బడ్జెట్టుకు వెనకాడలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక తాను మాస్‌ మహారాజా రవితేజకు డైహార్ట్‌ ఫ్యాన్‌ అని తెలిపాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top