
ఆనంద్ శ్రీకృష్ణ (నందు), రష్మీ గౌతమ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నందు ఫస్ట్ లుక్‌తో పాటు రష్మీ గౌతమ్ లుక్స్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నటించాడు. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పాత్రకు సమానంగా రష్మీ పాత్ర కూడా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి.