Bollywood Star Amitabh Bachchan Buys Costly Flat In Mumbai - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన బిగ్‌ బీ.. అందుకోసమేనట.!

Published Tue, Sep 20 2022 7:16 PM

Bollywood Star Amitabh Bachchan Buy Costly Flat In  - Sakshi

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఫోర్ బంగ్లాస్‌ ప్రాంతంలోని పార్థినాన్ సోసైటీలో ఈ స్థిరాస్తిని కోనుగోలు చేశారని సమాచారం. బహుళ అంతస్తుల భవనంలోని 31వ ఫ్లోర్‌లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్‌మెంట్‌ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఖరీదెంత అనేది విషయం బయటికి రాలేదు. 

అయితే ఫ్లాట్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ నివాసం ఉండేందుకు కాదట. ఈ ఫ్లాట్‌ను కేవలం పెట్టుబడి ప్రయోజనాల కోసమే  కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బీ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.
(చదవండి: వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్)

ఇటీవల రిలీజైన బ్రహ్మాస్త్రలో అమితాబ్‌ ప్రధానపాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అలియా భట్, రణ్‌బీర్ కపూర్, నాగార్జున, మోనీరాయ్  నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో బిగ్‌ బీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు  వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుడ్‌బై'లోనూ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమితాబ్‌కు కూతురిగా నటిస్తోంది. వీటితో పాటు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి-14 సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement