ప్రియురాలికి బ్రేకప్‌ చెప్పేసిన యంగ్ హీరో! | Bollywood Hero Ahan Shetty And Tania Shroff Part Ways After 11 Years Relation, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Ahan Shetty-Tania Shroff Breakup: 11 ఏళ్ల పాటు డేటింగ్.. లవర్‌తో బ్రేకప్ చేసుకున్న 'ఆర్‌ఎక్స్‌100' హీరో!

Published Sun, Dec 24 2023 1:21 PM

Bollywood Hero Ahan Shetty Tania Shroff Part Ways After 11 Years Relation - Sakshi

బాలీవుడ్ స్టార్, నిర్మాత సునీల్ శెట్టి పరిచయం అక్కర్లేని పేరు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అహన్ శెట్టి. 2021లో తడప్‌(ఆర్‌ఎక్స్‌ 100 రీమేక్) అనే ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా హీరోయిన్‌గా నటించింది. అయితే ప్రస్తుతం అహన్‌ శెట్టి తన ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 11 ఏళ్లపాటు మోడల్ తానియా ష్రాఫ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న అహాన్ వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. 

ఈ విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. 'అహన్‌కు, తానియా చిన్నప్పటి నుంచి తెలుసు. వారిద్దరు ఓకే పాఠశాలలో చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పదకొండేళ్ల బంధానికి గత నెలలో ముగింపు పలికారు. ప్రస్తుతం ఈ జంట తమ జీవితంలో ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని' తెలిపారు. అయితే వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. తానియా ష్రాఫ్  పారిశ్రామికవేత్త జైదేవ్, రొమిలా ష్రాఫ్‌ల కుమార్తె. అయితే గతంలో అహాన్, తానియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement