ప్రముఖ నిర్మాత రెండో పెళ్లి.. మెహందీ వేడుకల్లో సినీ తారలు! | Bollywood Celebrities at Madhu Mantena and Ira Trivedi mehendi ceremony | Sakshi
Sakshi News home page

Mehendi Ceremony: ప్రముఖ నిర్మాత రెండో పెళ్లి.. వేడుకల్లో సినీ తారలు!

Jun 10 2023 9:42 PM | Updated on Jun 10 2023 9:47 PM

Bollywood Celebrities at Madhu Mantena and Ira Trivedi mehendi ceremony - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, ఐరా త్రివేది   ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. ఇవాళ రాత్రి ముంబయిలో జరుగుతున్న మెహందీ వేడుకలో అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. నిర్మాత మధు మంతెన, రచయిత-యోగా శిక్షకురాలు ఇరా త్రివేదిని జూన్ 11న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ, నిఖిల్ ద్వివేది తళుక్కున మెరిశారు. ఈ పెళ్లివేడుక ఆదివారం ఓ ముంబయిలోని ఓ హోటల్‌లో జరగనుంది.

(ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి )

ఈ జంట పెళ్లి తర్వాత త్వరలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధు, ఐరా ఒకరికొకరు చాలా కాలంగా పరిచయమున్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహాబంధంతో ఒక్కటవుతున్నారు. మధు మంతెన ప్రస్తుతం రామాయణం చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. అంతకుముందు గజిని, అగ్లీ,  క్వీన్ హిట్ చిత్రాలను మధు నిర్మించారు. 

నీనా గుప్తా కుమార్తెతో మసాబా గుప్తాతో విడాకులు

కాగా.. 2015లో ఫ్యాషన్ డిజైనర్, బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాను మధు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అయితే మసాబాను వివాహం చేసుకోక ముందే నందనా సేన్‌తో మధు రిలేషన్‌లో ఉన్నారు. 

(ఇది చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement