Bigg Boss Contestant Sumbul Touqeer's Father To Get Married Again - Sakshi
Sakshi News home page

తండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!

Jun 9 2023 1:34 PM | Updated on Jun 9 2023 2:10 PM

Bigg Boss Contestant Sumbul Touqeer Father To Get Married Again - Sakshi

పదేళ్ల నుంచి ఆయనకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు ఆయన ఇద్దరు కూతుర్లు.

బుల్లితెర నటి సుంబుల్‌ టక్కర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన తండ్రి టఖీర్‌ ఖాన్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వెల్లడించింది. వచ్చేవారం నీలోఫర్‌ అనే మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడని ఇంటర్వ్యూలో పేర్కొంది. నీలోఫర్‌ విషయానికి వస్తే.. ఆమెకు ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకుంది. తనకు రెండేళ్ల పాప కూడా ఉంది.

ఈ శుభవార్తను పంచుకున్న సుంబుల్‌.. 'మా నాన్నకు భార్యతో పాటు మాకు ఓ చెల్లి కూడా రాబోతోంది. త్వరలోనే వీరు మా కుటుంబంలో భాగం కానున్నారు' అంటూ ఎగిరి గంతేస్తోంది. నిజానికి తండ్రి టఖీర్‌ ఖాన్‌కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. పదేళ్ల నుంచి ఆయనకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు ఆయన ఇద్దరు కూతుర్లు.

ఒంటరిగా తమను పెంచి పెద్ద చేసి సర్వస్వం త్యాగం చేసిన ఆయనకు ఓ తోడును ఇవ్వాలని భావించారు. ఇన్నాళ్లకు సమయం అనుకూలించడంతో తండ్రికి రెండో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. కాగా సుంబుల్‌ ఖాన్‌ హిందీ బిగ్‌బాస్‌ 16 షోతో బాగా పాపులర్‌ అయింది. ఇమ్లీ, జోదా అక్బర్‌, చంద్రగుప్త మౌర్య వంటి పలు సీరియల్స్‌లో నటించింది.

ఇకపోతే ఇటీవలే ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి సైతం రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుని సెన్సేషన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా ప్రేమ ఎప్పుడైనా పుట్టొచ్చని, పెళ్లితో ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తప్పేముందని చెప్పుకొచ్చాడు.

చదవండి: కృతి సీతలా ఫీలవనేలేదు, అందుకే హగ్గులు, ముద్దులు: సీత పాత్రధారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement