Bollywood actor Sushant Singh Rajput Birth Anniversary: His Dreams Remains - Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput Birth Anniversary: చెదరని చిరునవ్వు, నీ డ్రీమ్స్‌ అలాగే ఉన్నాయ్‌!

Published Fri, Jan 21 2022 10:08 AM

Bollywood actor SushantSinghRajput Birth Anniversary: his dreams remains - Sakshi

Sushant Singh Rajput Birth Anniversary: చెదరని చిరునవ్వు,  భవిష్యత్తంతా  ఈ కుర్రాడిదే అన్నంత అద్భత నటన. అతని టాలెంట్‌ చూసి పెద్ద స్టార్‌ అవుతాడు అనుకున్నారు అంతా. కానీ అంతలోనే అనూహ్యంగా ఆ చుక్కల్లో కలిసిపోయాడు. అతడే బాలీవుడ్‌ విలక్షణ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.  కరియర్‌లో ఎదుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రపంచానికి గుడ్‌ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితం  సుశాంత్‌ అకాలమరణం యావత్‌ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

జనవరి 21  సుశాంత్ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పుట్టినరోజు.  సుశాంత్‌ ఈ లోకంలో ఉండి ఉండే ఈ రోజు తన 36వ బర్త్‌డేను సోదరీమణులు, అభిమానుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాడు. బట్‌..అన్నీ మనం అనుకున్నట్టు జరగవు  మిస్‌ యూ బ్రో అంటూ అభిమానులు సుశాంత్‌ను గుర్తు  చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి..హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటున్నారు.  సుశాంత్‌ కలగన్న ఆ  50 డ్రీమ్స్‌ తమకు స్పూర్తి అని కమెంట్‌  చేస్తున్నారు.

1986 జనవరి 21 న పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు పుట్టాడు సుశాంత్ సింగ్‌. నటన అంటే మక్కువతో మోడల్‌గా రాణించాడు. ఆ తరువాత కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో 2008లో టీవీ నటుడిగా  బుల్లితెరకు పరిచయమయ్యాడు.  అలా 2013లో కోటి ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి మూవీ ‘కై పో చే’ లో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలా తనకంటూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, పెద్దోళ్ల అండ లేకపోయినా స్వశక్తితో ఎదిగాడు. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న యువ నటుడు  బిగ్‌  స్క్రీన్‌పై కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.  ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ భక్షి, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్‌. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకుని జాతీయ స్థాయి ఒలింపియాడ్‌ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచాడు. సుశాంత్ కేవలం హీరోగానే కాదు, డ్యాన్సర్‌గా, దాతగా పేరు తెచ్చుకున్నాడు.

కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధిస్తూ కరియర్‌ అలా  సాగుతున్నతరుణంలో నెపోటిజమో,  మానసిక ఒత్తిడో, ధైర్యాన్ని కోల్పోయాడో తెలియదు కానీ  2020 జూన్ 14 న శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్‌ ముంబైలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని చనిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, ప్రకృతి, క్రికెట్‌, విమానాన్ని నడపడం, అంతరిక్షం, మొక్కలు నాటడం, సిక్స్‌ ప్యాక్‌ బాడీ, ఒక పుస్తకం రాయడం,లాంబోర్గిని కారు ఇలాంటి 50 కలల్ని రాసిపెట్టుకున్న సుశాంత్‌ అర్థాంతరంగా తనువు చాలించడం ఒక మిస్టరీ. ఆత్మహత్యే అని పోలీసులు చెప్పినా, చిచ్చోరే సినిమాద్వారా ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చిన హీరో సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.

Advertisement
Advertisement