బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల ఆటను బట్టి, వారి వ్యక్తిత్వాలను బట్టి ఫ్యాన్స్ ఏర్పడుతుంటారు. ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరి కదలికను క్షుణ్ణంగా గమనిస్తూ నచ్చినవారికి ఓటేస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఇందుకు విభిన్నంగా బ్యాక్‌గ్రౌండ్ చూసి ఓటేశారు. అవును, మొదటివారం తన గతాన్ని తవ్వుతూ.. భార్యాబిడ్డల కోసం, వారి దగ్గర గౌరవంగా బతకడం కోసం బోరుమని ఏడ్చిన నాగ మణికంఠకు జనాలు ఓట్లు గుద్దారు.
గుండె కొట్టుకునేది నీ కోసమే..
కేవలం అతడి బాధకు చలించిపోయే ఓట్లేశారు తప్ప ఆటను చూసి కాదు. ఈ క్రమంలో నాగమణికంఠ భార్య శ్రీ ప్రియ, కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నా గుండె కొట్టుకునేది నీ కోసమేనంటూ మణికంఠ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఓ వీడియో వదిలారు. అందులో మణి.. అతడి కూతురితో ఆప్యాయంగా కలిసున్నాడు. మరో ఖాతా నుంచి ఏకంగా నాగమణికంఠ పెళ్లి వీడియో వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు కలిసే ఉంటారని, తప్పకుండా ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య, కూతురు వస్తారని కామెంట్లు చేస్తున్నారు.
ఎన్నో కష్టాలు
ఇకపోతే బిగ్‌బాస్ 8 ప్రారంభమైన రోజు మణికంఠ ఎన్నో కష్టాలు పడినట్లు చూపించారు. వైవాహిక బంధం కూడా సరిగా లేనట్లు చూపించారు. మణికంఠ సైతం.. భార్యతో విడిపోయినట్లుగా మాట్లాడాడు. తనవల్లే కూతురికి దూరమైనట్లు తెగ బాధపడిపోయాడు. కానీ హౌస్‌లోకి వెళ్లాక మాత్రం తన భార్య బంగారమని చెప్పాడు.
పెద్ద ప్లానే..
బిగ్‌బాస్‌కు వెళ్లమని భార్య సపోర్ట్ చేసిందని, షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చిందని ఆమె గొప్పతనాన్ని బయటపెట్టాడు. కేవలం తన కాళ్లపై నిలబడటానికే భార్య, కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే మణికంఠ ఫ్యామిలీ వీక్ వరకు బిగ్‌బాస్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment