బిగ్‌ బాస్‌కు ముందే SPY బ్యాచ్‌ స్టార్ట్‌ అయిందా.. వీడియో వైరల్‌ | Bigg Boss Telugu 7: Story Behind SPY Batch - Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌కు ముందే SPY బ్యాచ్‌ ప్లాన్‌.. జనాల్ని మోసం చేశారా..?

Published Wed, Dec 20 2023 8:19 AM

Bigg Boss Telugu 7 SPY Batch Behind Story - Sakshi

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 7 ముగిసింది. ఈ సీజన్‌ ప్రధానంగా SPY  (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA  (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్‌ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్‌లోని ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్‌ గేమ్‌ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్‌ మా' బ్యాచ్‌ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్‌ ప్లాన్‌ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్‌గానే గేమ్‌ ఆడుతూ వచ్చారు.

ఇదే క్రమంలో శివాజీ, యావర్‌, ప్రశాంత్‌ కూడా SPY అనే పేరుతో గ్రూప్‌ అయ్యారు.. వారు కూడా గ్రూప్‌ గేమ్‌ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్‌ మాత్రమే గ్రూప్‌ గేమ్‌ ఆడుతుందని హౌస్‌లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్‌లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్‌ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్‌ చేయలేదు. బిగ్‌ బాస్‌లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్‌ ఆడుతూ.. SPA బ్యాచ్‌ మాత్రమే గ్రూప్‌ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. 

SPY బ్యాచ్‌పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్‌ బాస్‌కు ముందు ప్రశాంత్‌ను ఎక్కడా చూడలేదని యావర్‌ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్‌, యావర్ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్‌కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది.

ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్‌ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్‌ బాస్‌ స్టార్ట్‌ కాకముందు ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్‌ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్‌ ప్లాన్‌ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్‌గా చెప్పిన స్పా బ్యాచ్‌... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement