Bigg Boss Telugu 6: Revanth Furious On Sri Satya After She Failed in Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: తన డబ్బులు పొయాయని ఫీలైన రేవంత్‌, శ్రీసత్యపై ఆక్రోశం

Dec 8 2022 3:59 PM | Updated on Dec 8 2022 5:05 PM

Bigg Boss Telugu 6: Revanth Furious On Sri Satya After She Failed in Task - Sakshi

నీ వల్ల డబ్బులు కట్‌ అయితే మాత్రం సీరియస్‌ అవుతానని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. చివరికి అతడు అన్నట్లే జరిగింది. ఆమె లోపలకు వెళ్లకపోవడంతో లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు ఇంటిసభ్యులకు సువర్ణావకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇప్పటిదాకా టాస్కులతో డబ్బు సంపాదించిన హౌస్‌మేట్స్‌కు ఈసారి దెయ్యం టాస్కు ఇచ్చాడు. ఈ దెబ్బతో హడలిపోయిన ఇంటిసభ్యులు మా వల్ల కాదని బెంబేలెత్తుతున్నారు. అయినప్పటికీ భయంతో వణికిపోతూనే ఆదిరెడ్డి, శ్రీహాన్‌ చీకటి గదిలోకి వెళ్లి బిగ్‌బాస్‌ చెప్పిన వస్తువులను వెతికి తీసుకొచ్చారు. ఈసారి శ్రీసత్యను డార్క్‌ రూమ్‌లోకి వెళ్లమన్నాడు బిగ్‌బాస్‌. కానీ ఆమె మాత్రం నేనొక్కదాన్ని రాలేనంటూ తలుపు బయటే నిల్చుండిపోయింది.

విన్నర్‌ అయ్యేది తనేనని ఫిక్స్‌ అయిన రేవంత్‌.. నీ వల్ల డబ్బులు కట్‌ అయితే మాత్రం సీరియస్‌ అవుతానని ముందే వార్నింగ్‌ ఇచ్చాడు. అయినా చివరికి అతడు అన్నట్లే జరిగింది. ఆమె లోపలకు వెళ్లకపోవడంతో లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో శ్రీసత్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రేవంత్‌. తర్వాత బిగ్‌ బాంబ్‌ అనే మరో ఛాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో శ్రీసత్య, ఇనయ, రేవంత్‌ పాల్గొన్నారు. మరి వీరిలో ఎవరు గెలిచారు? ఎవ ఓడిపోయారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే!

చదవండి: ఇండస్ట్రీలో విషాదం, హాస్యనటుడు కన్నుమూత
స్వాతి నా ఆల్‌టైం క్రష్‌: హరీష్‌ శంకర్‌

Advertisement
 
Advertisement
Advertisement