Bigg Boss Telugu 5: ఆ కార‌ణం వ‌ల్లే శ్వేత ఎలిమినేట్ అయిందా!

Bigg Boss Telugu 5: Swetha Varma Eliminated For These Reasons - Sakshi

చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్ హౌస్ అంటే ఒక బంగారు నిధి. అక్క‌డ అడుగు పెడితే చాలు ఎక్క‌డ‌లేని పాపులారిటీ సొంత‌మై సినిమా ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని ఆశ‌ప‌డుతుంటారు. గెలిచినా, ఓడినా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం మాత్రం ప‌క్కా అని మైండ్‌లో ఫిక్స‌యిపోతుంటారు. గ‌త సీజ‌న్‌లో అఖిల్‌, సోహైల్‌, అరియానా.. అత్యంత సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి సెన్సేష‌న‌ల్ సెల‌బ్రిటీలుగా బ‌య‌ట‌కు వెళ్లారు.  వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీ అయ్యారు కూడా! 

అందుకే బిగ్‌బాస్ షోలో ఒక్క‌సారైనా పాల్గొనాల‌నేది ఎంతోమంది సెల‌బ్రిటీలు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆ అవ‌కాశం కొంద‌రినే వ‌రిస్తుంది. ఈ క్ర‌మంలోనే యువ న‌టి శ్వేతా వ‌ర్మ‌కు బిగ్‌బాస్ ఛాన్స్ వ‌చ్చింది. త‌నేంటో ప్రూవ్ చేసుకుంటానంటూ ఈ భామ హౌస్‌లో అడుగు పెట్టింది. మొద‌ట్లో చ‌డీచ‌ప్పుడు లేకుండా సైలెంట్‌గా ఉన్న శ్వేత రానురాను ఫైర్ బ్రాండ్‌గా మారిపోయింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ, గేమ్‌ను, రిలేష‌న్స్‌ను విడివిడిగా చూసే ఈమె మెచ్యూరిటీకి ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఆమె ఆట‌తీరు చూశాక‌ శ్వేత త‌ప్ప‌కుండా టాప్ 5లో ఉంటుంద‌నుకున్నారంతా! కానీ ఊహించ‌ని రీతిలో ఆరోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది శ్వేత‌. 

ఆరోవారం నామినేష‌న్స్‌లో శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్, ప్రియాంక, యాంకర్ రవి, శ్వేతా, జెస్సీ, సన్నీ ఉన్నారు. వీరిలో శ్వేత‌కు పెద్ద‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ లేక‌పోవ‌డంతో ఆమెకు పెద్ద‌గా ఓట్లు ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. అలాగే త‌ను ప‌దే ప‌దే ఇంగ్లీషులో మాట్లాడ‌టం కూడా చాలామంది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌న్న‌ది మ‌రో వాద‌న‌! నామినేష‌న్స్‌లోకి రాక‌పోవ‌డం కూడా ఆమెకు మైన‌స్‌గా మారిందంటున్నారు. బిగ్‌బాస్ ప్రారంభ‌మ‌య్యాక ఐదు వారాల వ‌ర‌కు ఆమె ఒక్క‌సారి కూడా నామినేష‌న్స్‌లోకి రాలేదు. దీంతో త‌న ఫ్యాన్స్ వేరే కంటెస్టెంట్ల‌కు స‌పోర్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. వెర‌సి ఆరోవారం నామినేష‌న్స్‌లోకి వ‌చ్చిన శ్వేత‌ను ఉన్న కొద్ది ఫ్యాన్స్ కాపాడుకోలేక‌పోయారు.

ర‌వి ఇచ్చిన ఐడియాను గుడ్డిగా ఫాలో అయి బిగ్‌బాస్ ప్రాప‌ర్టీని ధ్వంసం చేసి శ్వేత త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. అలాగే గ‌తంలో మాన‌వ‌త్వం గురించి లెక్చ‌ర్లు ఇస్తూనే నామినేష‌న్స్‌లో హ‌మీదాను రంగుతో కొట్టింది  ఇక టాస్కుల్లోనూ వైల్డ్‌గా మారిపోతూ అంద‌రినీ ద‌డ‌ద‌డ‌లాడించింది. ఇలా కొన్ని త‌న‌కు తెలిసి, తెలియ‌క చేసిన త‌ప్పుల‌కు ఫ‌లితంగా ఎలిమినేష‌న్ శిక్ష అనుభ‌వించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top