అలాంటి అమ్మాయి కావాలి: అఖిల్‌

Bigg Boss Telugu 4: Interesting Talk Between Akhil And Monal - Sakshi

"నాకు పెళ్లైంది, గ‌ర్భ‌వ‌తిని, గుజ‌రాతీలో భ‌ర్త పేరు చెప్ప‌కూడ‌దు.." అంటూ బిగ్‌బాస్ షోలో మోనాల్‌.. అఖిల్‌ను ఆట‌ప‌ట్టించిన విష‌యం తెలిసిందే. అయితే అఖిల్ మాత్రం త‌న‌కు కాబోయే అమ్మాయి ఎలా ఉండాల‌నేది సీరియ‌స్‌గా చెప్తున్నాడు. అన్‌సీన్ వీడియోలో ఎప్ప‌టిలాగే అఖిల్‌, మోనాల్ ఇద్ద‌రూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ సంద‌ర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కావాల‌ని మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. 'పొట్టిగా ఉన్నా ఓకే. న‌న్ను ప‌ట్టించుకోకున్నా ప‌ర్వాలేదు, కానీ మా అమ్మానాన్న‌ను మాత్రం బాగా చూసుకోవాలి. జెన్యూన్ ఉండాలి. నన్నెవ‌రేమైనా అంటే త‌ను స్టాండ్ తీసుకోవాలి. ఇలా అన్ని ల‌క్ష‌ణాలుండే అమ్మాయి దొరుకుతుందా?' అని మోనాల్‌ను అడ‌గ్గా క‌చ్చితంగా దొరుకుతుంద‌ని ఆమె భ‌రోసా ఇచ్చింది. (చ‌ద‌వండి: త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటున్న మాస్ట‌ర్‌)

అయితే మోనాల్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌నుకున్నాడో ఏమో కానీ 'షోలో ఉన్న‌ప్పుడా? షో అయిపోయిన త‌ర్వాతా?' అని అఖిల్ ఆమెకు సూటిప్ర‌శ్న విసిరాడుడు. అందుకు ఏమాత్రం త‌ట‌ప‌టాయించ‌ని మోనాల్‌ "షో పూర్త‌య్యాక త‌ప్ప‌కుండా దొరుకుతుంది, అఖి, రా రా అంటూ నీకోసం గేట్ దగ్గ‌ర వెయిట్ చేస్తుంద"‌ని చెప్పింది. ఆమె నాకు తెలుసా? అని అఖిల్ అడ‌గ్గా ప‌రిచ‌యం లేని అమ్మాయని మోనాల్ స్ప‌ష్టం చేసింది. దీంతో ముక్కూమొహం తెలీని అమ్మాయి త‌న‌కొద్ద‌ని అనేశాడు. "నాతో ప‌రిచ‌యం ఉండాలి, నా గురించి తెలిసుండాలి. ఆమెను చూడ‌గానే గుండె ఎక్కువ‌ స్పీడుతో కొట్టుకోవాలి" అ‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సంభాష‌ణ ద్వారా వీరి అభిమానుల‌కు క్లారిటీ ఇవ్వ‌డం క‌న్నా కన్ఫ్యూజ‌నే ఎక్కువ‌గా క్రియేట్ చేశారు. (చ‌ద‌వండి: షాకింగ్‌: ‌హౌస్‌ నుంచి వెళ్లిపోయిన నోయ‌ల్‌!)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top