'అమ్మో' రాజ‌శేఖ‌ర్: దేని కోసం ఇంత డ్రామా?

Bigg Boss 4 Telugu: Netizens Troll Amma Rajasekhar - Sakshi

త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటున్న మాస్ట‌ర్‌

'ఎన్నాళ్లో వేచిన‌ హృద‌యం.. ఈ వారం ఎదుర‌వుతుంటే..' అని బిగ్‌బాస్ ప్రేమికులు సోమ‌వారం నుంచి తెగ పాట‌లు పాడేసుకుంటున్నారు. అందుకు కారణం లేక‌పోలేదు.. కొంత‌కాలంగా నామినేష‌న్‌లోకి రాకుండా త‌ప్పించుకు తిరుగుతున్న‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మెహ‌బూబ్ ఈ వారం ఎలిమినేష‌న్ జోన్‌లోకి వ‌చ్చేశారు. వీళ్లిద్ద‌రిలో బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సులు మాస్ట‌ర్‌కే ఎక్కువ‌గా ఉన్నాయి. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా గొడ‌వ పెట్టుకుంటూ, క్యారెక్ట‌ర్‌ను నిందిస్తూ అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకుంటున్నాడు. మొద‌ట్లో అతి చేసిన‌ట్లు అనిపించిన మెహ‌బూబ్ ఈ మ‌ధ్య త‌గ్గి ఉంటున్నాడు. అలానే టాస్కుల్లోనూ ఇర‌గ‌దీస్తుండ‌టంతో ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డే చాన్సులు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి మాస్ట‌ర్ మాత్రం త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌)

రేష‌న్ మేనేజ‌ర్ అయితే ఎలిమినేష‌న్ నుంచి సేఫా?!
ఇలాంటి క్లిష్ట‌ స‌మ‌యంలో అమ్మ రాజ‌శేఖ‌ర్‌ టాస్క్‌లు బాగా ఆడుతూ, కామెడీ చేస్తూ అంద‌రినీ న‌వ్విస్తూ ఓట్ల‌ను ఆక‌ర్షించాల్సి ఉంటుంది. కానీ ఆయ‌న దానికి బ‌దులు వేరే రూటు ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. బిగ్‌బాస్ ప్రారంభంలో సేఫ్ గేమ్ ఆడి అడ్డంగా దొరికిపోవ‌డంతో అప్ప‌టి నుంచి గేమ్‌కు స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. అయితే ఇప్పుడు మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామా ఆడుతున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న‌టి టాస్క్‌లో మెహ‌బూబ్‌తో పాటు మాస్ట‌ర్.. అరియానాకు స‌పోర్ట్ చేశాడు. చివ‌రికి కెప్టెన్ అయిన అరియానా.. మోనాల్‌ను రేష‌న్ మేనేజ‌ర్(RM)‌గా నియ‌మించింది. ఇది ఆయ‌న‌కు అస్స‌లు మింగుడుప‌డ‌లేదు. స‌పోర్ట్ చేసిన త‌న‌కు ఆ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పాల్సింద‌ని అగ్గి మీద గుగ్గిల‌మ‌య్యాడు. అస‌లే నామినేష‌న్‌లో ఉన్న త‌న‌కు RM ఇస్తే స‌పోర్ట్ అయ్యేద‌ని అర్థం ప‌ర్థం లేని మాట‌లు మాట్లాడాడు. దీంతో ఆయ‌న అస‌లు బాధ అర్థ‌మైన అరియానా RM అయితే సేవ్ అవుతార‌ని ఎక్క‌డా లేద‌ని స్పష్టం చేసింది. (చ‌ద‌వండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టిన‌ట్లు ఉంది: మాస్ట‌ర్‌)

కెమెరాల ముందు మాస్ట‌ర్ యాక్టింగ్‌!
ఈ వ్య‌వ‌హారంపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రేష‌న్ మేనేజ‌ర్ అయితే సేఫ్ అవుతారా? ఇది చూసి నాగార్జున కూడా షాక్ అవుతారేమోన‌ని సెటైర్లు విసురుతున్నారు. అరియానాపై నోటికొచ్చిన‌ట్లు అరిచి చివ‌ర్లో కెమెరాల ముందు బ‌ల‌వంతంగా క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం దేనిక‌ని మాస్ట‌ర్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వ‌ల్ల ఎవ‌రూ ఓట్లు వేయ‌ర‌ని చెప్తున్నారు. నిజంగా ఆయ‌న‌ రేష‌న్ మేనేజ‌ర్ అవ్వాల‌నుకుంటే.. ఆ విష‌యాన్ని ముందే అరియానాకు చెప్తే స‌రిపోయేది. అలా చెప్పిన‌ప్ప‌టికీ నియ‌మించ‌క‌పోతే ఇంత సీను చేసిన‌దానికి ఓ అర్థంపర్థం ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. టాస్కుల్లో ఎలాగో స్పోర్టివ్‌నెస్ లేదు, మ‌ళ్లీ దీనికి ప‌నికిరాని గొడ‌వ‌లు పెట్టుకోవ‌డ‌మెందుక‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటివి త‌గ్గించుకుంటే కాస్తైనా ఓట్లు రాలుతాయ‌ని సూచిస్తున్నారు. (చ‌ద‌వండి: కాస్త క్లోజ్‌గా ఉంటే ల‌వ్వా?: మాస్ట‌ర్ భార్య‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 23:46 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో...
28-11-2020
Nov 28, 2020, 23:12 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో...
28-11-2020
Nov 28, 2020, 20:58 IST
బిగ్‌బాస్ క‌థ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైన‌ల్‌లో చోటు ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు...
28-11-2020
Nov 28, 2020, 17:59 IST
బిగ్‌బాస్ షో అంటే ఒక మ‌నిషి ఎలా ఉంటాడో చూపించ‌డ‌మే కాదు. అత‌డి శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా వెలికి తీస్తూ...
28-11-2020
Nov 28, 2020, 16:53 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఫినాలేలో చోటు ద‌క్కించుకునేందుకు రేసు మొద‌లైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాల‌ను ప‌క్క‌కు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే...
28-11-2020
Nov 28, 2020, 15:56 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగుపెట్టిన ఉత్త‌రాది ముద్దుగుమ్మ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది....
27-11-2020
Nov 27, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది....
27-11-2020
Nov 27, 2020, 18:35 IST
టెలివిజన్‌ బిగ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత...
26-11-2020
Nov 26, 2020, 23:24 IST
నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో...
26-11-2020
Nov 26, 2020, 20:16 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు...
26-11-2020
Nov 26, 2020, 17:09 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని...
26-11-2020
Nov 26, 2020, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.....
25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top