మా ఆయ‌నేంటో నాకు తెలుసు: మాస్ట‌ర్ భార్య‌ ఫైర్‌

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Wife Comments On Divi Vadthya - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభంలో హైద‌రాబాదీ మోడ‌ల్‌, న‌టి దివి వైద్య రేసుగుర్రంలో స్పంద‌న‌లా ఉండేది. త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో ఇంటిస‌భ్యులంద‌రి గురించి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్పి ఒక్క ఎపిసోడ్‌కే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అటు ఇంట్లో కూడా అమ్మ రాజ‌శేఖ‌ర్ దివిని హీరోయిన్‌గా ప్ర‌క‌టించేశాడు. కానీ హీరో తానేన‌న్నాడు. అలా వారిద్ద‌రి మ‌ధ్య స్నేహ‌బంధం మొద‌లైంది. అయితే అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా దివిని త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ అంటూ క‌హానీలు అల్లేవాడు. ఇంత‌లోనే దివి ఎలిమినేట్ కావ‌డంతో ఆయ‌న ఏడుస్తూనే ఆమెను ద‌గ్గ‌రుండి సాగ‌నంపాడు. బ‌య‌ట ఎవ‌రేమ‌నుకున్నా నువ్ నా అమ్మ‌వే అమ్మా.. అని ఎమోష‌న‌ల్ అయింది. దివి ఆయ‌న్ను అమ్మా అని పిలిచినా స‌రే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ కొంద‌రు నెటిజ‌న్లు లేనిపోనివి సృష్టిస్తున్నారు. దీనిపై అమ్మ రాజ‌శేఖ‌ర్ భార్య రాధ‌ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. (‌బిగ్‌బాస్: ఎలిమినేష‌న్‌కు బ‌దులు కొత్త ప్ర‌యోగం)

ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ హౌస్‌లో వారిమ‌ధ్య ఏం లేదు. మా ఆయ‌న‌, దివి కేవ‌లం ఫ్రెండ్స్‌. ఏదో ఉన్న‌ట్టు సృష్టిస్తూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కావాల‌ని నింద‌లు వేస్తున్నారు. మా ఆయ‌నేంటో నాకు తెలుసు. అయినా మేల్‌, ఫిమేల్ కాస్త క్లోజ్‌గా ఉంటే ల‌వ్ వ‌చ్చేస్తుందా? మొద‌ట‌ క‌రాటే క‌ల్యాణితో రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేశారు. అది నాకు కామెడీగా అనిపించింది. వారి మ‌ధ్య ఏదో ఉంద‌ని మిగ‌తావాళ్ల‌కు ఏ యాంగిల్‌లో అనిపించిందో తెలీదు. వాళ్లిద్ద‌రేమీ సీక్రెట్‌గా మాట్లాడుకోలేదు. ఎక్క‌డ‌వ‌ర‌కు సెన్సిటివ్‌గా ఉండాలో అక్క‌డివ‌ర‌కే ఉంటారు. ఒకవేళ సెన్సిటివ్‌గా ఉండే అమ్మాయిల‌కు ఆయ‌న ప‌డిపోతారంటే ఊరంతా బోలెడు మంది ఉండాలి అని చెప్పుకొచ్చారు. (మోనాల్ మ‌ళ్లీ సేఫ్‌, దివి ఎలిమినేట్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top