బిగ్‌బాస్‌: నోయ‌ల్ వీడ్కోలు, హారిక క‌న్నీళ్లు

Bigg Boss 4 Telugu: Noel Will Comeback After Treatment - Sakshi

మోనాల్ మీద సెటైర్‌, హారిక‌కు మాత్రం హ‌గ్‌

కెప్టెన్‌గా అవ‌త‌రించిన అరియానా

రేష‌న్ మేనేజ‌ర్ నియామ‌కంపై మాస్ట‌ర్ అసంతృప్తి

అనారోగ్యంతో అవ‌స్థ ప‌డుతున్న నోయ‌ల్.. గంగ‌వ్వ లాగే బిగ్‌బాస్‌ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిస‌భ్యులు భారంగా వీడ్కోలు ప‌లికారు. కానీ వీలైనంత త్వ‌ర‌గా కోలుకుని నోయ‌ల్ మ‌ళ్లీ తిరిగి రానున్నాడు. మ‌ళ్లీ వ‌చ్చేస్తాడ‌న్న సంతోషం క‌న్నా ఇప్పుడు వెళ్లిపోతున్నాడ‌న్న బాధే హారిక‌ను ఎక్కువ‌గా కుంగ‌దీసింది. దీంతో అభిజిత్ ఆమెను ఆప్యాయంగా హ‌త్తుకుని ఊర‌డించాడు. ఇక ముందుగా ఊహించిన‌ట్లుగానే అరియానా ఎనిమిదో కెప్టెన్‌గా అవ‌త‌రించింది. కానీ ప్రోమోలో మాస్ట‌ర్‌, అవినాష్ క‌లిసి ఇంటిస‌భ్యుల‌ను ఆట‌ప‌ట్టించిన క్లిప్పింగుల‌ను మాత్రం మొత్తానికే చూపించ‌లేదు. ఇదిలా వుంటే నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం విశేషాలు, గొడ‌వ‌లు జ‌రిగాయో చ‌దివేసేయండి...

ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే కెప్టెన్సీ టాస్క్‌
అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న నోయ‌ల్‌కు అర్ధ‌రాత్రి దాటినా నిద్ర పట్టలేదు. దీంతో ఒంట‌రిగా పాట‌లు పాడుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. త‌ర్వాతి రోజు అభి నోయ‌ల్ ద‌గ్గ‌ర కూర్చుని మోనాల్‌పై సెటైర్ వేశాడు. ఆమె పెద్ద పెద్ద‌గా అడుగులేసుకుంటూ ఒంటెలా న‌డుస్తుంద‌ని కామెంట్ చేశాడు. మ‌రి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావ‌ని నోయ‌ల్ అభి గురించి చెప్పుకొచ్చాడు. అనంత‌రం బిగ్‌బాస్ "ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే" కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక యాపిల్ చెట్టు, దానిపై పోటీదారుల ఫొటోలు అతికించి ఉన్నాయి. దానిప‌క్క‌నే ఒక డ‌బ్బా(అందులో క‌త్తి), దాని తాళం ఉన్నాయి. మూడుసార్లు బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు అబ్బాయిలు ఆ తాళ‌పుచెవిని సంపాదించి న‌చ్చిన అమ్మాయికి ఇవ్వొచ్చు. అప్పుడు ఆమె తాళంచెవి సాయంతో డ‌బ్బాలోని క‌త్తి తీసుకుని ఎవ‌రు కెప్టెన్ అవ‌డానికి వీల్లేద‌ని భావిస్తారో ఆమె ఫొటో అతికించి ఉన్న యాపిల్‌ను తెంపి ముక్క‌లు ముక్క‌లుగా కోయాల్సి ఉంటుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అస్వ‌స్థ‌త‌కు గురైన నోయ‌ల్)

నీ తెలివి ప‌ని చేయ‌లేదు: హారిక‌
ఈ టాస్క్‌లో మొద‌ట తాళ‌పు చెవిని ద‌క్కించుకున్న అఖిల్‌ను తాళ‌పు చెవి త‌న‌కివ్వ‌మంటే త‌న‌కివ్వండ‌ని అమ్మాయిలు అర్జీ పెట్టుకున్నారు. కానీ అత‌డు మాత్రం అంద‌రూ ఊహించిన‌ట్లుగా మోనాల్‌కే ఇచ్చాడు. కత్తి చేత‌బ‌ట్టిన మోనాల్‌.. హారిక‌ కెప్టెన్సీకు అర్హురాలు కాదంటూ ఆమె ఫొటో ఉన్న పండును ముక్కలు ముక్క‌లు చేయ‌డంతో దేత్త‌డి హ‌ర్ట‌య్యింది. త‌ర్వాత తాళ‌పు చెవిని ద‌క్కించుకున్న మెహ‌బూబ్ దాన్ని అరియానాకు ఇచ్చాడు. క‌త్తి అందుకున్న అరియానా.. లాస్య ‌ఫొటో ఉన్న పండును నాశ‌నం చేసి ఆమెను కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించింది. త‌ర్వాత కీ చేజీక్కించుకున్న మాస్ట‌ర్ దాన్ని అరియానాకు ఇవ్వ‌గా ఆమె మోనాల్‌ను సైడ్ చేసేసింది. దీంతో అరియానా హౌస్‌లో రెండో మ‌హిళా కెప్టెన్‌గా అవ‌త‌రించింది. అప్ప‌టికే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న హారిక‌.. నీకు తెలివి ఉంది కానీ ఈ రోజు ప‌ని చేయ‌లేదని మోనాల్‌ను న‌వ్వుతూనే తిట్టింది.

రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉంటే సేఫ్ అయ్యేవాడిని
కెప్టెన్ అరియానా రేష‌న్ మేనేజ‌ర్‌గా మోనాల్‌ను ఎంచుకుంది. దీంతో మాస్ట‌ర్ ముఖం మాడ్చుకున్నాడు. నామినేష‌న్‌లో ఉన్న‌ప్పుడు రేష‌న్ మేనేజ‌ర్‌గా ఇస్తే త‌న‌కు స‌పోర్ట్ అయ్యేద‌ని అర్థం ప‌ర్థం లేని మాట‌లు అన్నాడు. అస‌లు తాను మోనాల్‌కు స‌పోర్ట్ చేసి ఉండాల్సింద‌ని, నీకు విశ్వాసం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. క‌న్నీళ్లు రాక‌పోయినా కెమెరాల ముందు ఏడుపు న‌టించిన‌ట్లు ఈజీగా అర్థ‌మ‌వుతోంది. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగెత్తిన అరియానా.. రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉంటే సేవ్ అవుతార‌ని ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయినా స‌రే ప‌ట్టించుకోని మాస్ట‌ర్‌.. నువ్వు చేసిన ప‌నికి నాకు చెప్పుతో కొట్టిన‌ట్లుగా ఉందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఈ గొడ‌వ‌తో అరియానా త‌ల బొప్పి క‌ట్టింది. (చ‌ద‌వండి: క‌మెడియ‌న్‌కు ముద్దు పెట్టిన హీరోయిన్‌)

నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక‌
అనంత‌రం అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ నోయ‌ల్‌ను వైద్యులు ప‌రీక్షించారు. అత‌డు మెడిక‌ల్ రూమ్‌కు వెళ్ల‌డం చూసిన హారిక..‌ నోయ‌ల్‌ వెళ్లిపోవ‌డం నాకిష్టం లేదంటూ గుక్క‌పెట్టి ఏడ్వ‌డంతో ఆమెను అభిజిత్ హ‌త్తుకుని ఓదార్చాడు. ఇక నోయల్‌ను కన్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. స్పెష‌లిస్టుల స‌ల‌హా మేర‌కు మ‌రింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని సూచించాడు. అయితే త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్య‌వంతులై తిరిగి రావాల‌న్నాడు. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాన‌ని హారిక నోయ‌ల్‌ వెళ్లిపోయిన  చాలాసేప‌టివ‌ర‌కు ఏడుస్తూనే ఉంది. (చ‌ద‌వండి: నాన్న డిఫెన్స్ ఉద్యోగి, కానీ..:  నోయ‌ల్ త‌మ్ముడు)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
23-11-2020
Nov 23, 2020, 19:18 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు వ‌చ్చే కొద్దీ ఇంట్లో లెక్క‌లు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘ‌ట్టం నుంచి అఖిల్ గ్రాఫ్...
23-11-2020
Nov 23, 2020, 18:04 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌న్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. రోజులు త‌గ్గేకొద్దీ వారి...
22-11-2020
Nov 22, 2020, 23:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు...
22-11-2020
Nov 22, 2020, 18:03 IST
బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒక‌త్తైతే అంద‌రికీ వండి పెట్ట‌డమ‌నేది మ‌రో ఎత్తు. మొద‌టి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో...
22-11-2020
Nov 22, 2020, 16:50 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోగా‌ బిగ్‌బాస్ త‌న పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో...
22-11-2020
Nov 22, 2020, 15:54 IST
నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్ల‌ను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిస‌భ్యులు సైతం రెట్టింపు...
21-11-2020
Nov 21, 2020, 23:22 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మ‌రోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డిచింది. కాక‌పోతే వ‌చ్చిన‌వారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్...
21-11-2020
Nov 21, 2020, 20:33 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ ర‌కంగా అదృష్ట‌వంతులు. క‌రోనా దూర‌ని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది....
21-11-2020
Nov 21, 2020, 19:43 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఎలిమినేష‌న్‌లో చోటు చేసుకున్న ట్విస్టులో అంతా ఇంతా కాదు. ఒక‌రు వెళ్లిపోతార‌నుకుంటే మ‌రొక‌రు ఎలిమినేట్ కావ‌డం,...
21-11-2020
Nov 21, 2020, 16:59 IST
కంటెస్టెంట్లు క‌లిసి ఉండాల‌న్నా, గొడ‌వ‌లు పెట్టుకోవాల‌న్నా అదంతా బిగ్‌బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్‌-అభిజిత్ విష‌యంలో ఇది తేట‌తెల్ల‌మ‌వుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్...
21-11-2020
Nov 21, 2020, 15:56 IST
వినోద‌మే క‌రువైన కాలంలో స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను పంచుతామంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌. క‌రోనా వ‌ల్ల ఈసారి...
20-11-2020
Nov 20, 2020, 22:54 IST
ఎట్టకేలకు హారిక కెప్టెన్‌ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక.. మోనాల్‌ సాయంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top