చాక్లెట్ లొల్లి: అభి హారిక మ‌ధ్య చిచ్చు పెట్టింది

Bigg Boss Telugu 4: Noel Sean Sick In House - Sakshi

బీబీ డే కేర్ బిగ్‌బాస్ హౌస్‌లోని కేర్‌టేక‌ర్ల‌కు మాత్ర‌మే కాదు, బ‌య‌ట ప్రేక్ష‌కుల‌కు కూడా విసుగును తెప్పించింది. దీంతో బిగ్‌బాస్‌ నేడు ఆ టాస్క్‌కు ముగింపు పలికాడు. అందులో హింస‌-స‌హ‌నానికి మారుపేర్లుగా నిలిచిన‌ అరియానా- సోహైల్ జోడీ విజేత‌గా నిలిచింది. దీంతో అప్ప‌టివ‌ర‌కు ఎంతో అల్ల‌రి చేస్తూ కొంటె ప‌నులు చేసిన హారిక క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరయ్యింది. ఇక‌ గ‌త కొంత కాలంగా టాస్కులు ఆడ‌లేక ఇబ్బందులు ప‌డుతున్న నోయ‌ల్ మ‌రింత అనారోగ్యానికి గుర‌య్యాడు. న‌డ‌వ‌డానికి కూడా చాలా ఇబ్బంది ప‌డ్డ అత‌డిని వైద్యులు ప‌రీక్షించ‌నున్నారు. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

చాక్లెట్ దొంగిలించిన పాపానికి హారిక‌పై కోపం
చిన్న‌పిల్లల్లా మారిన కంటెస్టెంట్లు దాగుడు మూత‌లు ఆడుకున్నారు. త‌ర్వాత మాస్ట‌ర్ జేబులో నుంచి హారిక చాక్లెట్‌ కొట్టేసింది. దీంతో మాస్టర్‌తో పాటు అత‌డి కేర్ టేక‌ర్ అభిజిత్ కూడా కోపానికి వ‌చ్చాడు. చాక్లెట్ పోయింద‌ని మాస్ట‌ర్ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అంద‌రిమీద కోపంతో కేక‌లేశాడు. చివ‌రికి హారిక త‌నే స్వ‌యంగా వెళ్లి ఆయ‌న‌తో మాట్లాడి సారీ చెప్పినా అత‌డు కూల్ అవ‌లేదు. చాక్లెట్ కొట్టేసింద‌న్న‌ కోపంలో అత‌డు హారిక మెడ‌లు ప‌ట్టుకున్నాడ‌ని అభిజిత్‌.. లాస్య‌, నోయ‌ల్‌తో చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: నాగ్ క‌న్నా ఎక్కువ తీసుకుంటున్న స‌మంత‌)

హారిక మీద సీరియ‌స్ అయిన అభి
పాకెట్‌లో నుంచి తీసుకోవ‌డం లాక్కోవ‌డ‌మా? దొంగ‌త‌న‌మా అని అభి ప్ర‌శ్నించాడు. అది దొంగ‌త‌న‌మే అని క్లారిటీ ఇచ్చిన హారిక ఆ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే మాట్లాడ‌క‌పోయావేన‌ని తిరిగి ప్ర‌శ్నించింది. ఎదురు ప్ర‌శ్న‌కు చిర్రెత్తిన అభి.. నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్ప‌కు. ఏం మాట్లాడుతున్నావు?  నాకు న‌చ్చిన‌ప్పుడే చెప్తాన‌ని సీరియ‌స్ అయ్యాడు. అయితే అంత‌కుముందు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లుంది. దాన్ని అభి ప్ర‌స్తావిస్తూ.. అప్పుడు వేస్ట్ అనుకుంటూ మ‌ధ్య‌లో నుంచి ఎందుకు వెళ్లిపోయావు? అని మండిప‌డ్డాడు. దీంతో హారిక అత‌డికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ఇంకోసారి అలా చేయ‌నంటూ అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. అభి మాట‌ల‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న హారిక ఈ గొడ‌వ‌కంత‌టికీ మూల‌కార‌ణ‌మైన‌ చాక్లెట్‌ను మాస్ట‌ర్‌కు తిరిగిచ్చేసింది. (చ‌ద‌వండి: ఈసారి మ‌హిళా విజేత ఉండ‌క‌పోవ‌చ్చు: కౌశ‌ల్‌)

అది నా గేమ్ ప్లాన్‌: అభి
స‌మ‌యం చూసి పులిలా పంజా కొట్ట‌డ‌మే త‌న‌ గేమ్ ప్లాన్ అని అభిజిత్ మెహ‌బూబ్‌తో చెప్పుకొచ్చాడు. ఎంత సేపు అబ్జ‌ర్వ్ చేస్తే అన్ని స‌మాధానాలు దొరుకుతాయ‌ని, అది మోనాల్ విష‌యంలో తెలిసొచ్చిందని చెప్పాడు. మ‌రోవైపు హారిక అంద‌రూ ప‌డుకున్నాక లాస్య ద‌గ్గ‌ర చాక్లెట్లు కొట్టేసి భ‌ద్రంగా దాచుకుంది. త‌ర్వాతి రోజు పొద్దున లేవ‌గానే చాక్లెట్లు క‌నిపించ‌క లాస్య కంగారు ప‌డింది. రాత్రి హారిక ఇల్లంతా క‌లియ‌ తిర‌గ‌డం తాను చూశాన‌ని అవినాష్ చెప్పాడు. దీంతో ఆమె వెళ్లి హారిక‌ను అడ‌గ‌డంతో దొంగిలించిన చాక్లెట్లు ఇచ్చేస్తానంది. (చ‌ద‌వండి: ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన అరియానా)

న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతున్న నోయ‌ల్‌
పాపం సోహైల్‌కు అరియానా బాధ నుంచి క్ష‌ణం కూడా విముక్తి దొర‌క‌డం లేదు. ఆమెను మ‌ళ్లీ ఎత్తుకుని ఆడించాడు. నిమ్మ‌కాయ‌ను పిండు కానీ త‌న‌ను పిండ‌ద్దొని వేడుకున్నాడు. ఎప్పుడూ త‌న‌ మీదే ఎక్కుతున్నావు, నేల మీద కూడా న‌డ‌వాల‌ని అరియానాకు సూచించాడు. త‌ర్వాత మెహ‌బూబ్ సోహైల్‌ను గ‌ట్టిగా కొరికేయ‌డంతో ఏడ‌వ‌లేక న‌వ్వేశాడు. ఇక మోనాల్ క్లాస్ చెప్ప‌డం కోసం అఖిల్‌ బ్లాక్‌బోర్డ్ మీద బొమ్మ వేశాడు. క్లాసు మొద‌ల‌వ‌గానే ల‌వ్ అంటే మోనాల్ అని అవినాష్ ప్రేమ‌పాఠాలు వ‌ల్లించాడు. నోయ‌ల్‌కు ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అవినాష్‌కు కూడా అభిజితే కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. భుజాలు క‌ద‌ల‌డం లేద‌ని, మెడ‌పై న‌రాలు ప‌ట్టేశాయ‌ని, కాళ్లు న‌డ‌వ‌డానికి కూడా రావ‌ట్లేద‌ని నోయ‌ల్ బాధ‌ప‌డ్డాడు. రాత్రంతా నిద్ర కూడా పోలేద‌ని చెప్పాడు. అయితే ఇవ‌న్నీ భ‌విష్య‌త్తులో పెద్దది కాకుండా చూసుకోమ‌ని అభి అత‌డికి స‌ల‌హా ఇచ్చాడు. బిగ్‌బాస్ కూడా అనారోగ్యం కార‌ణంగా నోయ‌ల్‌కు విశ్రాంతి క‌ల్పించాడు.

అల్ల‌రితో ఏడిపించి చివ‌రికి త‌నే ఏడ్చేసింది
త‌ర్వాత బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌తో స‌ర‌దాగా నేల‌, నీళ్లు, మంట ఆడించారు. ఈ టాస్క్‌లో అభి కాళ్లు జారి కింద‌ప‌డ‌గా అఖిల్‌ గెలిచాడు. అనంత‌రం బీబీ డే కేర్ టాస్క్ ముగిసిన‌ట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. ఈ టాస్క్‌లో విన్న‌ర్ జోడీని ఎంపిక చేయ‌మ‌ని లాస్య‌ను ఆదేశించ‌గా ఆమె సోహైల్‌-అరియానా పేర్ల‌ను వెల్ల‌డించింది. దీంతో బిగ్‌బాస్ వారికి స్పెష‌ల్ గిఫ్టులు పంపారు. ఇక‌ త‌న‌కొచ్చిన మ‌ట‌న్‌ను ఎవ‌రికీ ఇవ్వ‌న‌ని, ఒక్క‌డినే తింటాన‌ని, ఎవ‌రాపుతారో చూస్తాన‌ని సోహైల్‌.. అవినాష్‌కు స‌వాలు విసిరాడు. మ‌రోవైపు అప్ప‌టివ‌ర‌కు టాస్క్‌లో భాగంగా ఆడుకున్న‌ చింపాంజీ బొమ్మ‌ను త‌న‌కే ఇచ్చేయ‌మ‌ని, దాన్ని చూస్తే ఇంట్లోవాళ్ల‌ను చూసిన‌ట్లుంద‌ని అరియానా ఏడ్చేసింది. (చ‌ద‌వండి: నామినేష‌న్ అప్పుడు చూపిస్తా: అవినాష్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 23:46 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో...
28-11-2020
Nov 28, 2020, 23:12 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో...
28-11-2020
Nov 28, 2020, 20:58 IST
బిగ్‌బాస్ క‌థ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైన‌ల్‌లో చోటు ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు...
28-11-2020
Nov 28, 2020, 17:59 IST
బిగ్‌బాస్ షో అంటే ఒక మ‌నిషి ఎలా ఉంటాడో చూపించ‌డ‌మే కాదు. అత‌డి శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా వెలికి తీస్తూ...
28-11-2020
Nov 28, 2020, 16:53 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఫినాలేలో చోటు ద‌క్కించుకునేందుకు రేసు మొద‌లైంది. కంటెస్టెంట్లు బంధాలు, అనుబంధాల‌ను ప‌క్క‌కు నెట్టి పూర్తిగా గేమ్‌పైనే...
28-11-2020
Nov 28, 2020, 15:56 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగుపెట్టిన ఉత్త‌రాది ముద్దుగుమ్మ మోనాల్ గ‌జ్జ‌ర్ ఎప్పుడూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది....
27-11-2020
Nov 27, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది....
27-11-2020
Nov 27, 2020, 18:35 IST
టెలివిజన్‌ బిగ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు లభించిన ఆదరణ మరే ఇతర షోలకు లభించదనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో గత...
26-11-2020
Nov 26, 2020, 23:24 IST
నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో...
26-11-2020
Nov 26, 2020, 20:16 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు...
26-11-2020
Nov 26, 2020, 17:09 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని...
26-11-2020
Nov 26, 2020, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.....
25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top