షాకింగ్‌: బిగ్‌బాస్ నుంచి నోయ‌ల్ అవుట్‌!

Bigg Boss 4 Telugu: Noel Sean Walks Out From Bigg Boss - Sakshi

బిగ్‌బాస్ ప్రేమికుల‌కు, నోయ‌ల్ అభిమానుల‌కు చేదువార్త‌. మిస్ట‌ర్ కూల్ నోయ‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వచ్చేశాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమో వ‌దిలింది. గ‌త కొంత‌కాలంగా త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను పంటి కింద భ‌రిస్తూ న‌వ్వుతూ వ‌చ్చిన నోయ‌ల్‌కు ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. అడుగు వేసి అడుగు వేయ‌డ‌మే క‌ష్టంగా మారింది. సరిగా విశ్రాంతి లేక మెడ న‌రాలు, భుజాలు నొప్పి పెడుతూ అత‌డిని మ‌రింత బాధించాయి. ఈ క్ర‌మంలో నిన్న‌టి బీబీ డే కేర్ టాస్క్‌లో బిగ్‌బాస్‌ నోయ‌ల్‌కు మిన‌హాయింపు క‌ల్పించాడు. నేడు అత‌డిని వైద్యులు ప‌రీక్షించ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అత‌డికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హౌస్‌లో నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌ని వైద్యులు తేల్చి చెప్పారు. అత‌డిని మెరుగైన చికిత్స కోసం హౌస్ నుంచి వీడ్కోలు తీసుకోమ‌ని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో షాక్ తిన్న కంటెస్టెంట్లు నోయ‌ల్‌కు భారంగా వీడ్కోలు ప‌లికారు. అయితే చికిత్స పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్లీ లోనికి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అస్వ‌స్థ‌త‌కు గురైన నోయ‌ల్)

కాగా గ‌తంలోనూ ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో గంగ‌వ్వ ఇంటిని వీడిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో నోయ‌ల్ కూడా త‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌ని, గంగ‌వ్వ లాగే వెళ్లిపోతాన‌ని చెప్పుకొచ్చాడు. అయినా స‌రే ఇన్నివారాలు త‌న బాధ‌ను భ‌రిస్తూ హౌస్‌లో నెట్టుకురావ‌డం నిజంగా ప్ర‌శంస‌నీయం. ఇక గ‌త‌ నామినేష‌న్‌లో కాలునొప్పి అంటూ టాస్కుల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని దివి అత‌డిని నామినేట్ చేసింది. ప్ర‌స్తుత ప్రోమోతో అత‌డికి చాలారోజుల నుంచే ఆరోగ్యం బాగోలేద‌ని నిరూపిత‌మైంది, అయితే ఓ మంచి కంటెస్టెంటు హౌస్‌లో నుంచి హ‌ఠాత్తుగా వెళ్లిపోవ‌డాన్ని అందరూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. నోయ‌ల్‌ను మిస్ అవుతామంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకొని, హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. (చ‌ద‌వండి: బాయ్‌ఫ్రెండ్ సినిమాలు వ‌దులుకోమ‌న్నాడు: దివి)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
23-11-2020
Nov 23, 2020, 19:18 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు వ‌చ్చే కొద్దీ ఇంట్లో లెక్క‌లు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘ‌ట్టం నుంచి అఖిల్ గ్రాఫ్...
23-11-2020
Nov 23, 2020, 18:04 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌న్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. రోజులు త‌గ్గేకొద్దీ వారి...
22-11-2020
Nov 22, 2020, 23:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు...
22-11-2020
Nov 22, 2020, 18:03 IST
బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒక‌త్తైతే అంద‌రికీ వండి పెట్ట‌డమ‌నేది మ‌రో ఎత్తు. మొద‌టి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో...
22-11-2020
Nov 22, 2020, 16:50 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోగా‌ బిగ్‌బాస్ త‌న పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో...
22-11-2020
Nov 22, 2020, 15:54 IST
నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్ల‌ను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిస‌భ్యులు సైతం రెట్టింపు...
21-11-2020
Nov 21, 2020, 23:22 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మ‌రోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డిచింది. కాక‌పోతే వ‌చ్చిన‌వారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్...
21-11-2020
Nov 21, 2020, 20:33 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ ర‌కంగా అదృష్ట‌వంతులు. క‌రోనా దూర‌ని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది....
21-11-2020
Nov 21, 2020, 19:43 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఎలిమినేష‌న్‌లో చోటు చేసుకున్న ట్విస్టులో అంతా ఇంతా కాదు. ఒక‌రు వెళ్లిపోతార‌నుకుంటే మ‌రొక‌రు ఎలిమినేట్ కావ‌డం,...
21-11-2020
Nov 21, 2020, 16:59 IST
కంటెస్టెంట్లు క‌లిసి ఉండాల‌న్నా, గొడ‌వ‌లు పెట్టుకోవాల‌న్నా అదంతా బిగ్‌బాస్ చేతిలో ఉంటుంది. అఖిల్‌-అభిజిత్ విష‌యంలో ఇది తేట‌తెల్ల‌మ‌వుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్...
21-11-2020
Nov 21, 2020, 15:56 IST
వినోద‌మే క‌రువైన కాలంలో స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను పంచుతామంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌. క‌రోనా వ‌ల్ల ఈసారి...
20-11-2020
Nov 20, 2020, 22:54 IST
ఎట్టకేలకు హారిక కెప్టెన్‌ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక.. మోనాల్‌ సాయంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top