బిగ్‌బాస్: సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్‌!

Bigg Boss Telugu 4: Akhil Sarthak Sent To Secret Room - Sakshi

సీక్రెట్ రూమ్‌.. ఇందులోకి వెళ్లే కంటెస్టెంటుకు లాభాల‌తో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అప్ప‌టిదాకా త‌మ‌తో క్లోజ్‌గా ఉన్న‌వాళ్లు త‌మ గురించి ఏమ‌నుకుంటున్నారు?  తాము తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారా? లేదా? ఒక‌వేళ తాము తిరిగి రావ‌డానికి బిగ్‌బాస్ ఏదైనా త్యాగం చేయ‌మంటే అందుకు ఒప్పుకుంటారా? వ‌ంటి అన్ని విష‌యాలు తెలుసుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. త‌న‌కోసం నిల‌బ‌డేవారు హౌస్‌లో ఎంత‌మంది ఉన్నార‌ని తెలుసుకోవ‌చ్చు. గ‌త సీజ‌న్‌లో అలీ, పున‌ర్న‌విని సీక్రెట్ రూమ్‌లోకి పంపిచారు. వాళ్లు ఈ సీక్రెట్ రూమ్ టాస్క్‌ను బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఆ టాస్క్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నారు. ఆ త‌ర్వాత‌ రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయ్యాడ‌ని అంద‌ర్నీ న‌మ్మించి సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు. అక్క‌డ త‌న గురించి ఎవ‌రేం మాట్లాడుకుంటున్నారో తెలిసి రాహుల్ నివ్వెర‌పోయాడు. (చ‌ద‌వండి: అఖిల్ మాటిచ్చాడు, ఎవ‌ర్నీ ల‌వ్ చేయ‌డు)

దీంతో హౌస్‌లోకి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చాక వితిక‌, వ‌రుణ్‌ల‌తో దూరంగా ఉంటూ అలీ, శివ‌జ్యోతికి క్లోజ్ అయ్యాడు. తాజాగా ఈ సీజ‌న్‌లో కూడా సీక్రెట్ రూమ్ సిద్ధం చేశార‌ట‌. ఇందులోకి అఖిల్‌ను పంపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే క‌న‌క నిజ‌మైతే అఖిల్‌కు అంద‌రి నిజ‌స్వ‌రూపాలు తెలుసుకునేందుకు మంచి ఛాన్స్ ల‌భించిన‌ట్లే. ఎవ‌రు అస‌లు ఫ్రెండ్‌? ఎవ‌రు ఫేక్ అనేది అత‌డికి క్లారిటీ వ‌స్తుంది. దీంతో అత‌డు త‌న గేమ్ ప్లాన్ మార్చుకునే అవ‌కాశ‌ముంది. అయితే అఖిల్‌ను రాత్రికి రాత్రే సీక్రెట్ రూమ్‌లోకి ఎందుకు పంపార‌బ్బా అని నెటిజ‌న్లు తెగ ఆలోచిస్తున్నారు. నేటి కెప్టెన్సీ పోటీలో ఏదో తేడా కొట్టింద‌ని, అందుకే అత‌డిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించి ఉండ‌వ‌చ్చ‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అఖిల్ నిజంగానే ర‌హ‌స్య గ‌దిలో అడుగు పెట్టాడా? అది బిగ్‌బాస్ వేసిన శిక్షా? లేక సీక్రెట్ టాస్కా? అన్న‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: జ‌బ‌ర్ద‌స్త్‌లోకి మ‌ళ్లీ తీసుకుంటారు: అవినాష్ త‌మ్ముళ్లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top