అఖిల్ మాటిచ్చాడు, ఎవ‌ర్నీ ల‌వ్ చేయ‌డు

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Mother Comments On Monal Gajjar - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఎంత‌మంది కంటెస్టెంట్లు ఉన్నా కెమెరాలు మాత్రం అఖిల్‌, మోనాల్‌నే ప్ర‌ధానంగా ఫోక‌స్ చేసేవి. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య కుచ్ కుచ్ హోతా హై అని ప్రేక్ష‌కులు బ‌లంగా ఫిక్స‌య్యారు. ఆమె క్ష‌ణం క‌నిపించ‌క‌పోయినా త‌ల్లడిల్లిపోయేవాడు. ఆమె లేక‌పోతే అఖిల్ లేడు అనేంత‌గా వారి రిలేష‌న్ జ‌నాల‌కు క‌నెక్ట్ అయింది.  అయితే ఇది ప్రేమ కాద‌ని, కేవ‌లం స్నేహ‌మేన‌ని అఖిల్ త‌ల్లి స్ప‌ష్టం చేశారు. బిగ్‌బాస్‌లో ప్రేమ వంటివాటిలో దూర‌న‌ని త‌న‌కు మాటిచ్చాడ‌ని చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. బిగ్‌బాస్ అయిపోగానే మీ ఇంటికి కోడ‌లు వ‌స్తుందా? అన్న ప్ర‌శ్న‌కు అంత సీన్ లేద‌ని ఆమె కొట్టిపారేశారు. ఎలాంటి వాటిలో దూర‌కుండా గేమ్ మీద మాత్ర‌మే ఫోక‌స్ పెట్టాల‌ని షోలోకి వెళ్లేముందే అఖిల్‌కు మ‌రీ మ‌రీ చెప్పాన‌ని తెలిపారు.

విల‌న్‌గా చేసీ చేసీ అలానే క‌నిపిస్తున్నాడు
50 రోజుల నుంచి హౌస్‌లోనే ఉంటున్నాడు. కాబ‌ట్టి మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యేవాళ్ల‌తోనే ఫ్రెండ్‌షిప్ చేస్తాడ‌ని, ప్రేమ వంటివాటిలో దూర‌డ‌ని న‌మ్మ‌క‌ముంద‌న్నారు. మోనాల్‌ను నామినేట్ చేయ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ మోనాల్ మంచి ఫ్రెండ్ అవుతుందేమో కానీ కోడ‌లిగా మాత్రం రాద‌ని తేల్చి చెప్పారు. అఖిల్ గేమ్ ఆడుతున్నాడు. అందులో భాగంగానే మోనాల్‌పై గుడ్డు కొట్టాడు కానీ త‌ర్వాత మ‌ళ్లీ ఫ్రెండ్స్ అవుతార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక‌ సీరియ‌ల్స్‌లో విల‌న్‌గా చేసి చేసి క‌నుబొమ్మ‌లు పైకి ఎగ‌రేస్తూ అంద‌రికీ విల‌న్‌లాగే క‌నిపిస్తున్నాడ‌ని తెలిపారు. (చ‌ద‌వండి: 'అమ్మో' రాజ‌శేఖ‌ర్: దేని కోసం ఇంత డ్రామా?)

అఖిల్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాలి
కానీ మావాడు మాత్రం హీరో అని చెప్పుకొచ్చారు. క‌చ్చితంగా టాప్ 5లో ఉంటాడ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. బిగ్‌బాస్ నుంచి వ‌చ్చాక అఖిల్ మ‌న‌సులో ఏముందో తెలుసుకుని పెళ్లి చేస్తామ‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రినైనా ఇష్ట‌ప‌డితే మాత్రం వివాహం జ‌రిపించేస్తామ‌న్నారు. కానీ మోనాల్‌తో మాత్రం కుద‌ర‌ద‌ని నొక్కి చెప్పారు. ఎందుకంటే మోనాల్‌కు 30, అఖిల్‌కు 25, వ‌య‌సు వ్య‌త్యాసం మ‌రీ ఎక్కువ‌గా ఉంది కాబ‌ట్టి వాళ్లిద్ద‌రికీ పెళ్లి చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం వాళ్లు ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు అని తెలిపారు. (చ‌ద‌వండి: అఖిల్ ఇంకేదో ఆశించాడు, అందుకే..: మోనాల్‌)

అందుకోస‌మే గ‌డ్డం తీయ‌డు
హౌస్‌లో 'జంబ‌ల‌కిడి పంబ' టాస్క్‌ ఇచ్చినప్పుడు మేల్ కంటెస్టెంట్లు అంద‌రూ గ‌డ్డం గీసుకున్నారు. కానీ అఖిల్ మాత్రం త‌ప్పించుకు తిరిగాడు. పైగా అమ్మాయిగా డ్యాన్స్ చేసిన‌ప్పుడు కూడా త‌ల‌కు స్కార్ఫ్ క‌ట్టుకుని గ‌డ్డాన్ని కవ‌ర్ చేసుకున్నాడు. దీనిపై అఖిల్ త‌ల్లి స్పందిస్తూ వాడు ఎప్పుడూ గ‌డ్డం తీయ‌డ‌ని చెప్పుకొచ్చారు. అందం కోస‌మే గ‌డ్డం తీయ‌డు త‌ప్ప ప్రేమ‌లో విఫ‌ల‌మైన దేవ‌దాసులా గ‌డ్డం పెంచుకోవ‌ట్లేద‌ని పేర్కొన్నారు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top