అప్పుడే కొత్త సినిమా మొదలుపెట్టిన సోహైల్‌ | Bigg Boss Fame Syed Sohel Ryan Started New Movie | Sakshi
Sakshi News home page

Syed Sohel Ryan: బిగ్‌బాస్‌ ఫేం సోహైల్‌ కొత్త సినిమా షురూ!

Feb 6 2022 9:38 AM | Updated on Feb 6 2022 9:38 AM

Bigg Boss Fame Syed Sohel Ryan Started New Movie - Sakshi

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్‌ సంస్థలు నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు లక్ష్మణ్‌ మురారి, రమేష్‌ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

‘‘ఈ సినిమా కంటెంట్‌ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సోహైల్‌ ఇటీవల 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌' అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement