Rohini Home Tour: సొంతింటి కలను నిజం చేసుకున్న రోహిణి

Bigg Boss Fame Rowdy Rohini Finally Purchase House - Sakshi

బుల్లితెర సీరియల్‌ నటి, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రౌడీ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాక్టింగ్‌ టాలెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోహిణి ఎట్టకేలకు తన సొంతింటి కలను నిజం చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండలో డూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ తెగ ఎగ్జైట్‌ అయింది.

స్వంత ఇల్లు కొనుక్కోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని చెప్తూ ఆ ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తన ఇంటిని అంతా చూపిస్తూ హోమ్‌ టూర్‌ వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌, గెస్ట్‌ బెడ్‌రూమ్‌, సిట్టింగ్‌ ఏరియా, టెర్రస్‌ను అంతా చూపిస్తూ సందడి చేసింది. అయితే ఈ ఇంటిని ఫర్నీచర్‌తో సహా కొన్నానని, త్వరలోనే దీన్ని తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చేస్తానంది.

ముఖ్యంగా టెర్రస్‌పై తనకు నచ్చిన మొక్కలను పెంచుతానని చెప్పింది. మొత్తానికి ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. డూప్లెక్స్‌ అనగానే వెంటనే ఇల్లు కొనేశానన్న రోహిణి.. తన ఇంటికి ఎంత ఖర్చైందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top