బర్త్‌డే పార్టీ వివాదంపై స్పందించిన మెహబూబ్‌ | Bigg Boss Fame Mahaboob Comment His Birthday Party | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీ వివాదంపై స్పందించిన మెహబూబ్‌

Jul 31 2024 4:09 PM | Updated on Jul 31 2024 4:57 PM

Bigg Boss Fame Mahaboob Comment His Birthday Party

బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే పుట్టినరోజు వివాదం వార్త నెట్టింట భారీగా వైరల్‌ అయింది. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే, అనుమతలు లేకుండా మద్యం పార్టీ నిర్వహించారని రిసార్ట్‌ యజమానితో పాటు మెహబూబ్‌పై కూడా  పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెహబూబ్‌ ఇలా స్పందించాడు.

'జులై 29న నా పుట్టినరోజు జరిగింది. అయితే, నా తమ్ముడు సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. అందులో నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌లను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మా పార్టీ జరుగుతున్న రిసార్ట్‌కు కూడా పోలీసులు వచ్చారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ జరగకూడదని మా వద్ద ఉన్న బాటిల్స్‌ అన్నీ వారు సీజ్‌ చేశారు. అందుకు మేము కూడా ఒప్పుకున్నాం. కానీ, ఈ రిసార్ట్‌లో మద్యం అనుమతి ఉందని యజమాని చెప్పడంతోనే నా తమ్ముడు బుక్‌ చేశాడు. 

అయితే, కొందరు మీడియా వారు దీనిని తప్పుగా క్రియేట్‌ చేశారు. రేవ్‌ పార్టీ అంటూ ప్రచారం చేయడం నన్ను చాలా అన్యాయం. పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు. వారి గురించి తప్పుగా మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది. పూర్తి విషయం తెలుసుకోకుండా వార్తలు రాసేస్తే ఎలా..? నాపై తప్పుడు కథనాలు ఇచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటా.' అని వీడియో ద్వార చెప్పాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement