Bigg Boss Ariyana New House Images Goes Viral | కొత్త ఇంటికి మారిన అరియాన గ్లోరీ - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: కొత్త ఇంటికి మారిన అరియాన గ్లోరీ

May 12 2021 8:04 PM | Updated on May 13 2021 12:50 PM

Bigg Boss Fame Ariyana Glory Moved To New House Shares A Video - Sakshi

హాయ్‌ ఫ్రెండ్స్‌  రీసెంట్‌గా మేం కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇది మా పరిస్థితి అంటూ స్టోరీ షేర్‌ చేసింది

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్‌ సంపాదించి పెడితే బిగ్‌బాస్‌ ద్వారా తనెంటో ప్రూవ్‌ చేసుకుంది. సీజన్‌-4 హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియాన యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్‌ మీడియాలో ఆమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ భామ పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటోషూట్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ (బుధవారం) తను కొత్త ఇంటికి మారంటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో అరియాన మంకీ బొమ్మను చూపిస్తూ చింటు, చింటు అంటూ సందడి చేసింది. ఇక ఎక్కడపడితే అక్కడ సమాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న వారి కొత్త ఇంటిని చూపిస్తూ.. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌ రీసెంట్‌గా మేం కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇది మా పరిస్థితి’ అంటూ స్టోరీ షేర్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు ‘మీ ఇల్లు చాలా బాగుంది. ఇంతకి కొన్నారా లేదా రెంటుకు దిగారా’ అంటు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ ఇంటిని కొన్నారా లేదా అనేది మాత్రం ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement