గుడ్‌ న్యూస్‌ చెప్పిన భార్య.. ఏడ్చేసిన విశ్వ | Bigg Boss Contestant Vishwa To be a Father | Sakshi
Sakshi News home page

Actor Vishwa: రెండో సారి తండ్రి కాబోతున్న విశ్వ, సర్‌ప్రైజ్‌ చేసిన భార్య

Dec 22 2022 9:34 PM | Updated on Dec 22 2022 9:34 PM

Bigg Boss Contestant Vishwa To be a Father - Sakshi

 విశ్వ కొబ్బరి నీళ్లు తాగి తీయగానే ఉన్నాయిగా, ఏమైనా ప్రాంక్‌ చేస్తున్నావా? అని అడిగాడు. తర్వాత చాక్లెట్‌ కావాలని అడిగడంతో అది కూడా తీసుకొచ్చాడు.

నటుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ విశ్వ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అమె భార్య శ్రద్ధా యూట్యూబ్‌ వీడియో ద్వారా అభిమానులకు వెల్లడించింది. రెండోసారి మేము తల్లిదండ్రులు కాబోతున్నాం.. 'విశ్వకు ఇంకా ఈ గుడ్‌న్యూస్‌ చెప్పలేదు, తనను కలిసి సర్‌ప్రైజ్‌ చేస్తా. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు నేను బాంబేలో ఉన్నా, ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడు. వీడియో కాల్‌లో ఆ విషయం చెప్పాను. ఈసారి మాత్రం డైరెక్ట్‌గా చెప్పాలనుకున్నా.. పనిలో పనిగా ఈ ఆనందకర క్షణాలను వ్లాగ్‌లో రికార్డ్‌ చేస్తున్నాను. అది ఇంకా హ్యాపీ' అని చెప్పుకొచ్చింది.

ఇక వీడియోలో శ్రద్ధా కొబ్బరి బోండాం కావాలని అమాయకంగా అడిగింది. సరేనని విశ్వ కొబ్బరి బోండాం కొనిచ్చాడు. ఆ నీళ్లు తాగిన శ్రద్ధ ఇదేంటి పుల్లగా ఉందని హింటిచ్చింది. అది అర్థం చేసుకోని విశ్వ కొబ్బరి నీళ్లు తాగి తీయగానే ఉన్నాయిగా, ఏమైనా ప్రాంక్‌ చేస్తున్నావా? అని అడిగాడు. తర్వాత చాక్లెట్‌ కావాలని అడిగడంతో అది కూడా తీసుకొచ్చాడు. ఫ్యామిలీ ప్యాక్‌ చాక్లెట్‌ తీసుకొచ్చావు, ఫ్యామిలీ అని నొక్కి చెప్పింది శ్రద్ధ. అయినా సరే అర్థం చేసుకోలేకపోయాడు విశ్వ. ఇంకా ఏడిపించడం వద్దనుకున్న శ్రద్ధ చివర్లో తను ప్రెగ్నెంట్‌ అయిన విషయాన్ని రివీల్‌ చేయడంతో ఎమోషనలయ్యాడు విశ్వ.

చదవండి: 2022లో పత్తా లేని హీరోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement