మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా | Bigg Boss Arjun Ambati Theppa Samudram Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Theppa Samudram OTT Release: బిగ్‌బాస్ అర్జున్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Jul 30 2024 12:32 PM | Updated on Jul 30 2024 12:53 PM

Bigg Boss Arjun Ambati Theppa Samudram Movie OTT Release Details

బిగ్‌బాస్ షోలో పాల్గొని సినిమాల్లో ఛాన్సులు తెచ్చుకున్నోళ్లు తెలుగులో అయితే ఒకరిద్దరున్నారు. వీళ్లలో అర్జున్ అంబటి ఒకడు. గత సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వరకు వచ్చాడు. గతంలో సీరియల్స్ చేసిన అర్జున్.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'తెప్ప సముద్రం'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

వేసవిలో అంటే ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన 'తెప్ప సముద్రం' మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఆహా ఓటీటీలో ఆగస్టు 3 నుంచి అంటే ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని చూడొచ్చు.

'తెప్ప సముద్రం' అనే ఊరిలో స్కూల్ పిల్లలు మాయమవుతుంటారు. దీనికి కారణం కనుక్కోవడానికి ఎస్సై గణేశ్ వస్తాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు, ఈమె ప్రియుడు ఆటో డ్రైవర్ విజయ్ కూడా పిల్లల కోసం వెతుకుంటారు. మరోవైపు గంజాయి దందాతో పిల్లల మిస్సింగ్‌కి సంబంధం ఉందని ఎస్సై తెలుకుంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement