నన్ను ఆపొద్దు, అమ్మేస్తున్నా: సోహైల్‌ పనికి షాక్‌లో అరియానా

Bigg Boss Ariyana Warning To Syed Sohel Over Instagram Video: Check Details - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో టామ్‌ అండ్‌ జెర్రీ ఎవరు అనగానే సోహైల్‌, అరియానా అని టపీమని చెప్తారు. ఎంత కొట్టుకున్నా చివరికి కలిసిపోయే వీళ్లను అభిమానులు సోషల్‌ మీడియాలో సోహియానా అని పిల్చుకుంటారు. బిగ్‌బాస్‌ షో తర్వాత కూడా వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అరియానా మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు సోహైల్‌.

బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్‌ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్‌ ఓ వీడియో షేర్‌ చేశాడు. 'బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్‌ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి' అని చెప్పుకొచ్చాడు.

"మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. నా అజాత శత్రువు.. బిగ్‌బాస్‌ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్‌బాస్‌లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్‌ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా.." అని చెప్పుకొచ్చాడు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా  ఫైర్‌ అయింది. 'అరేయ్‌, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

చదవండి: సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top