
డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ షోలో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్‌కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడేం అతడి స్వస్థలం. తల్లిదండ్రులు ధరావత్ మనోజ్‌జాదవ్, మంగమ్మ. తండ్రి రిటైర్డ్ ఇంజినీర్, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 1996 ఏప్రిల్ 13న జన్మించిన గౌతమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.
చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తి. దీంతో డాక్టర్ చదువుతో పాటు ఎంబీఏ పూర్తి చేయగానే 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2019లో ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ చేస్తూనే హీరోగా నటించాడు. హిందీలో సిద్దూ ది రాక్‌స్టార్ సినిమా చేసి అక్కడా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన అతడు డాక్టర్‌ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. అయితే నాగార్జున మాత్రం అతడి చేతికి బేడీలు వేసి మరీ హౌస్‌లోకి పంపించాడు. ఇంట్లో అందంగా కనిపించే ఒక అమ్మాయికి ఈ బేడీలు వేయమన్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి!