నువ్వు తోపెహె.. బిగ్‌బాస్‌ను ఇలా కూడా వాడుకుంటారా? | Sakshi
Sakshi News home page

Sandeep: హీరోగా ఆట సందీప్‌.. బెస్ట్‌ సంచాలక్‌ అట! పోస్టర్‌పై నెట్టింట ట్రోల్స్‌..

Published Wed, Jan 3 2024 11:09 AM

Bigg Boss 7 Telugu Fame Sandeep Faces Trolls For 'The Shortcut' Movie Poster - Sakshi

ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజయవంతం అయింది. రైతుబిడ్డ విజేతగా.. బీటెక్‌ కుర్రాడు రన్నర్‌గా నిలిచాడు. నీతులు చెప్పడమే తప్ప పాటించడం తెలియని శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రియాంక, ప్రిన్స్‌ యావర్‌ నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా టాస్కుల బాహుబలిగా పేరు గడించిన అర్జున్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. అసలు ఫినాలే వరకు రాకుండా ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యాడు కొరియోగ్రాఫర్‌ సందీప్‌.

ఎన్నో తప్పులు.. అయినా బెస్ట్‌ సంచాలక్‌
బిగ్‌బాస్‌ 7 నుంచి ఎలిమినేట్‌ అయిన ఫస్ట్‌ మేల్‌ కంటెస్టెంట్‌గా, అలాగే నామినేషన్‌లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన హౌస్‌మేట్‌గా తనకంటూ ఓ రికార్డు కూడా ఉంది. ఇకపోతే ఫినాలే రోజు నాగార్జున.. కంటెస్టెంట్లకు ఒక్కో అవార్డు ప్రకటించాడు. అందులో భాగంగా.. సందీప్‌కు బెస్ట్‌ సంచాలక్‌ అవార్డు ఇచ్చాడు. నిజానికి సందీప్‌ సంచాలకుడిగా ఉన్నప్పుడు చాలా సార్లు తప్పులు జరిగాయి. కానీ ఎక్కువసార్లు అతడే సంచాలకుడిగా ఉన్నందుకో ఏమో కానీ తనను ఉత్తమ సంచాలకుడిగా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అదే అవార్డును తన పేరు ముందు పెట్టేసుకున్నాడు సందీప్‌. ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రస్తుతం హీరోగా ద షార్ట్‌కట్‌ అనే సినిమా చేస్తున్నాడు.

ఆస్కార్‌ గెలిచినట్లు ఫీలవుతున్నాడే..
విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్‌. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బిగ్‌బాస్‌ 7 బెస్ట్‌ సంచాలక్‌ సందీప్‌ అని ఉండటంతో నెట్టింట ట్రోల్స్‌ మొదలయ్యాయి. 'ఎవరైనా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అని వేసుకుంటారు.. కానీ బెస్ట్‌ సంచాలక్‌ ఏంట్రా బాబూ..', 'ట్రోఫీ గెలిచినట్లు ఫీలవుతున్నాడుగా.. దాన్నేదో ఆస్కార్‌లా వాడేసుకుంటున్నాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆడియో లాంచ్‌లో బిగ్‌బాస్‌ నుంచి ఫస్ట్‌ ఎలిమినేట్‌ అయిన మేల్‌ కంటెస్టెంట్‌ అని సందీప్‌ గురించి పొగుడుతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

చదవండి: ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'యానిమల్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?

Advertisement
 
Advertisement