Bigg Boss 7 Day 78 Highlights: అందరి టార్గెట్ శివాజీ గ్యాంగే.. ఎలిమినేట్ కత్తిపై పీకపెట్టిన ఆ బ్యూటీ!

 Bigg Boss 7 Telugu Day 78 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్‌ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్‌గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. 

రతికక చెప్పి మరీ అమర్ అలా
ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్‌లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
అమర్‌దీప్ - యావర్, రతిక
గౌతమ్ - ప్రశాంత్, శివాజీ
రతిక - అమర్‌దీప్, ప్రశాంత్
అర్జున్ - యావర్, శివాజీ
ప్రశాంత్ - గౌతమ్, రతిక
అశ్విని - సెల్ఫ్ నామినేషన్

యావర్ నో లాజిక్స్
ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్‌ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్‌లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్‌ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు.

ప్రశాంత్ vs గౌతమ్
తొలుత గౌతమ్, ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్‌లో సంచాలక్‌గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు.  కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్‌ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. 

పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్‌గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు.

శివాజీని లాజిక్స్‌తో కొట్టారు
ప్రశాంత్‌ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్‌లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు.  నేను సంచాలక్‌గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2023
Nov 20, 2023, 16:15 IST
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషల్లో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అత్యధికంగా బిగ్ బాస్...
20-11-2023
Nov 20, 2023, 11:45 IST
గేమ్‌లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్‌లో అవుట్‌ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని...
19-11-2023
Nov 19, 2023, 23:19 IST
బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్‌గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క...
18-11-2023
Nov 18, 2023, 23:51 IST
బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు....
18-11-2023
Nov 18, 2023, 19:01 IST
కానీ చివర్లో అశ్విని, శోభాలలో ఎవరో ఒకరిని బయటకు పంపించనున్నట్లు టాక్‌ నడిచింది. అయితే ఇవేవీ కాదని బిగ్‌బాస్‌ అనూహ్య...
18-11-2023
Nov 18, 2023, 17:32 IST
అనరాని మాటలని, సూటిపోటి మాటలతో వేధించి ఎదుటి వ్యక్తి కుంగిపోయేలా చేస్తాడు.. కానీ వాళ్లు ఏడిస్తే మాత్రం వెళ్లి ఓదార్చినట్లు...
18-11-2023
Nov 18, 2023, 16:19 IST
అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్‌...
18-11-2023
Nov 18, 2023, 13:30 IST
కోలీవుడ్‌లో  బిగ్ బాస్ సీజన్‌ 7 ప్రారంభం అయింది. ఇప్పటికే సుమారు 40 రోజులు దాటింది. అక్కడ కమల్‌ హాసన్‌...
17-11-2023
Nov 17, 2023, 23:09 IST
బిగ్‌బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల...
17-11-2023
Nov 17, 2023, 19:29 IST
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ గతంతో పోలిస్తే గత కొన్నివారాలుగా పికప్ అయిందని చెప్పొచ్చు. గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారు. అయితేనేం...
16-11-2023
Nov 16, 2023, 23:36 IST
బిగ్‌బాస్ షోలో శివాజీ బాగా ఆడుతున్నాడా? అంటే కచ్చితంగా కాదు. షో నిర్వహకులు శివాజీ మంచోడు అనే ఇమేజ్ క్రియేట్...
16-11-2023
Nov 16, 2023, 19:42 IST
బిగ్‌బాస్ షో సంగతేమో గానీ.. ఆర్గనైజర్స్ పెడుతున్న కొన్ని టాస్కులు ఆయా కంటెస్టెంట్స్ ప్రాణాల మీదకొస్తున్నాయి. తాజాగా తెలుగులో ప్రసారమవుతున్న...
16-11-2023
Nov 16, 2023, 17:08 IST
నీకన్నా పెద్దగా అరుస్తా.. ఎందుకరుస్తున్నావ్‌. అరవలేనా నేను అంటూ ఆమె మీదకు దూసుకెళ్లాడు. ఇది చూసిన నెటిజన్లు శివాజీ ద్వంద...
16-11-2023
Nov 16, 2023, 12:37 IST
నాకెందుకో ఒంట్లో బాగోలేనట్లు అనిపిస్తోంది. నాకు ఈ నెల పీరియడ్స్‌ కూడా రాలేదు. ఇంటికి వెళ్లాలనిపిస్తోంది అని భర్తతో వాపోయింది....
16-11-2023
Nov 16, 2023, 11:26 IST
పల్లవి ప్రశాంత్‌తో పోటీకి దిగి అక్కడా అతడే గెలిచాడు. ఇలా వరుసగా మూడు ఆటల్లో గెలిచి పాస్‌ను దక్కించుకున్నాడు. యావర్‌...
16-11-2023
Nov 16, 2023, 09:22 IST
బిగ్గెస్ట్‌ రియాలటీ షోగా  బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్‌లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50...
15-11-2023
Nov 15, 2023, 23:02 IST
బిగ్‌బాస్ ముద్దుబిడ్డ రతిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఓసారి ఎలిమినేట్ అయి బయటకెళ్లి వచ్చినా ఇంకా బుర్ర పనిచేయట్లేదు. ఏకంగా తమ్ముడికే...
15-11-2023
Nov 15, 2023, 16:30 IST
బిగ్‌ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్‌లో ఓ చిన్నపాటి...
15-11-2023
Nov 15, 2023, 16:27 IST
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామందికి గొడవలే గుర్తొస్తాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ ప్రసారమవుతోంది. శివాజీ దగ్గర నుంచి శోభా...
14-11-2023
Nov 14, 2023, 23:26 IST
అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్‌బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్‌లో...



 

Read also in:
Back to Top