Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Meets Party Activists And Normal People At Pulivendula
పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్‌ జగన్‌

సాక్షి, పులివెందుల: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్‌ జగన్‌ స్పీకరిస్తున్నారు.ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

T20 WC 2024: Afghanistan Beat australia  By 21 runs
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ప‌టిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్‌స్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది.ఈ విజ‌యంతో త‌మ సెమీస్ ఆశ‌ల‌ను అఫ్గానిస్తాన్ స‌జీవంగా ఉంచుకుంది. 150 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల దాటికి 127 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓ ద‌శ‌లో క్రీజులో మాక్స్‌వెల్ ఉన్న‌ప్పుడు ఆసీస్‌దే విజ‌యమ‌ని అంతా భావించారు. కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 20 ప‌రుగులిచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్‌ ఉల్‌ హక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌(59) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఓపెనర్లు గుర్బాజ్‌(60), ఇబ్రహీం జద్రాన్‌(51) పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో కమ్మిన్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

YS Jagan Fires On Chandrababu Govt For Demolishing YSRCP Party Office
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

KTR Responds Over Miyapur Issue
మియాపూర్‌ ఘటనపై స్పందించిన కేటీఆర్‌.. ఏమన్నారంటే?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, శనివారం మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోవడం.. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ కామెంట్స్‌ చేశారు. No Law No OrderHave you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n— KTR (@KTRBRS) June 23, 2024 ఇదిలా ఉండగా.. మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హెచ్‌ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.అయితే, గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్‌ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.

Sakshi Editorial On TDP Chandrababu Andhra Pradesh Politics
ఏ ఫర్‌ ఎటాక్‌... పీ ఫర్‌ పొక్లెయిన్‌?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్‌ చెప్పారు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్‌ సిక్స్‌ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనే కొటేషన్‌ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్‌ ఇంజన్‌ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్‌ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్‌ వయసు డెబ్బయ్‌ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్‌ ఫీల్డ్‌ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్‌జెన్‌ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్‌ స్టోరీలే. మయన్మార్‌ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్‌ జంగిల్‌ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్‌), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్‌ ఎస్టేట్‌ మోడల్‌ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్‌ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్‌ నిర్మాత కులీ కుతుబ్‌షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్‌ వాల్‌కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.ప్రధాన డ్యామ్‌కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్‌ వాల్‌ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, స్పిల్‌ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లుగా వ్యవహరిస్తారు.ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్‌ వాల్‌ కడతారని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్‌ డ్యామ్‌లను సగం కట్టి వదిలేశారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్‌ 11 నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయినట్టు అక్కడో పైలాన్‌ను ఆవిష్కరించారు.ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన తర్వాత కూడా కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేయడానికి, స్పిల్‌ చానల్‌ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్‌ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్‌ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్‌ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్‌ నుంచి కోరుతూ వస్తున్నది.మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్‌ ఎటాక్, పీ ఫర్‌ పొక్లెయిన్‌’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్‌సభ స్పీకర్‌ జీ.వీ. మావలంకర్‌ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్‌ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్‌సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. మూడు – స్పీకర్‌ గుర్తించాలి. ఈ స్పీకర్‌ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్‌ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్‌సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Notice to YSRCP party office at Rajamahendravaram
వైఎస్సార్‌సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం: టీడీపీ ప్రభుత్వం

సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్‌)­/అనంతపురం కార్పొరేషన్‌/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసు­మంతైనా లేకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశా­లను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లే­వంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్‌ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్‌డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్‌ 25న çఫస్ట్‌ ప్లోర్‌లో 120.34 స్క్వేర్‌ యార్డ్స్‌ ప్రపోజ్‌ చేస్తూ మార్ట్‌గేజ్‌ చేశారు. గతేడాది వీఎంఆర్‌డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యం­తరం లేకపోయినా..ఆటోమెటిక్‌గా ప్లాన్‌ అప్రూవల్‌ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్‌డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్ప­లేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు. బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ..నెల్లూరులోని 54వ డివిజన్‌ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్‌డోజర్స్‌తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్య­క్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌­రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్‌ అహ్మద్‌ అక్కడికి చేరుకుని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో మా­ట్లాడారు.ప్రభు­త్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీ­సుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకు­న్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగు­తోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కా­దని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యు­మెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పి­నప్పటికీ అధికా­రులు పట్టించుకోకుండా కూల్చేసా­మని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చే­స్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్‌ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్‌ మారుతీ­హరిప్రసాద్‌ శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయా­నికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్‌ఎల్‌సీ కా­లనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొ­న్నా­రు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వా­లని, అంతవరకు నిర్మాణాలు చేపట్ట­కూడదని, ఇప్ప­టివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యా­లయంలో ఆఫీస్‌ బాయ్‌ శ్రీనివాసులుకు నోటీసు అందించారు. ఇది అనధికారిక కట్టడంరాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌సీపీ తూర్పు గో­దావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్‌ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్త­య్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడ­మంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొ­న్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కా­ర్యా­లయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Gautam Ghattamaneni Stage Performance In London Namratha Post Viral
మహేశ్ కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు. తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)గౌతమ్ చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు. రీసెంట్‌గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లండన్‌లో ఓ నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది. కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత లాంచ్ చేస్తారేమో. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. నమ్రత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్‌లో మహేశ్‌ని మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Malibu mansion saled for record breaking 210 million usd
రియల్‌ ఎస్టేట్‌ రికార్డ్‌.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం

ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్‌ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్‌ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

Increase in Israel Anti Government Protests
Israel: ప్రజా ఆందోళనలు.. ముందస్తు ఎన్నికలకు డిమాండ్‌

ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.ఇజ్రాయెల్‌లోని కప్లాన్ స్ట్రీట్‌లో ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్‌మాన్ ఈ ఆందోళనల్లో పాల్గొని, దేశం కోసం ప్రజలంతా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిన్ బెట్ మాజీ అధిపతి యువల్ డిస్కిన్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ‘దేశ చరిత్రలో అత్యంత చెత్త , విజయవంతం కాని ప్రధాన మంత్రి’ అని పేర్కొన్నారు. వెంటనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిస్కిన్ 2005 నుండి 2011 వరకు షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షునిగా పనిచేశారు. అధికార లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటిన్స్కీ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే నినాదాలు కలిగిన బ్యానర్లు పట్టుకున్నారు. మరికొందరు గాజాలో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ర్యాలీ అనంతరం పలువురు ఆందోళనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనాల టైర్లను తగులబెట్టారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం మౌంటెడ్ పోలీసు సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. హమాస్ చేతిలో బందీలైనవారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్‌లో నిరసన కవాతు నిర్వహించారు.

Weekly Horoscope From 23 June 2024 To 29 June 2024 In Telugu
Weekly Horoscope: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతమే

మేషంమొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. క్రమేపీ మీకు ఎదురులేని పరిస్థితి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థులకు అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో మానసిక అశాంతి. వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.వృషభంఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు అందుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగల అవకాశం. కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.మిథునంరాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.కర్కాటకంకార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చరంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.కన్యరాబడి సంతృప్తినిస్తుంది. రావలసిన పైకం కూడా అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీసత్తా చాటుకునేందుకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు అనుకూల పరిస్థితి ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.తులఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవార్డులు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. లేత నీలం, పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికంకొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా వాయిదా వేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు నత్తనడనక సాగుతూ స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.ధనుస్సుఅనుకున్న పనులు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలు, దైవకార్యాల నిర్వహణపై చర్చలు ఫలిస్తాయి. కొత్త గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.మకరంకొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు మీదపడతాయి. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు, విష్ణుధ్యానం చేయండి.కుంభంకొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి కొంత సహాయం సైతం అందుతుంది. ఊహలు నిజం కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిత్రవిచిత్ర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం,, అనుకూల ఫలితాలు సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌వర్గాలకు శుభసూచకాలే. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నేరేడు, తెలుపు రంగులు.గణేశాష్టకం పఠించండి.మీనంముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత గులాబీ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement