రేపటి నుంచి అరియానా కథ వేరే ఉంటది: సోహైల్‌ | Bigg Boss 5 Telugu: Sohel Reveals Hint On Bigg Boss Buzz Host | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ బజ్‌కు అరియానా, కుమ్మేయంటున్న సోహైల్‌!

Sep 5 2021 4:59 PM | Updated on Sep 5 2021 7:43 PM

Bigg Boss 5 Telugu: Sohel Reveals Hint On Bigg Boss Buzz Host - Sakshi

Bigg Boss 5 Telugu Buzz Host: తెలుగు ప్రేక్షకులకు టన్నుల కొద్దీ కిక్కిచ్చేందుకు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 రెడీ అయింది. ఎప్పటిలాగే ఈసారి కూడా హౌస్‌లో సోషల్‌ మీడియా, బుల్లితెర సెలబ్రిటీల సంఖ్యే అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక వారాంతాల్లో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే బిగ్‌బాస్‌ బజ్‌ ప్రోగ్రామ్‌కు గత సీజన్‌ నుంచి ఓ కంటెస్టెంట్‌ను నిర్వాహకులు సెలక్ట్‌ చేశారు. ఆమె మరెవరో కాదు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ అంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

తాజాగా అరియానా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన వీడియోతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. 'అందరికీ నమస్కారం. బిగ్‌బాస్‌ 4 జర్నీకి ఏడాది పూర్తైంది. నాకోసం సమయం కేటాయించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రేపు ఒక ఎగ్జయిటింగ్‌ వార్తను మీకు తెలియజేయబోతున్నాను, అప్పటివరకు వెయిట్‌ చేయండి' అని చెప్పుకొచ్చింది. తను షేర్‌ చేసిన మరో వీడియోలో సోహైల్‌ మాట్లాడుతూ.. 'అరియానా రేపు టీవీలో కనిపిస్తుంది. చాలా స్పెషల్‌. రేపటినుంచి కథ వేరే ఉంటది. ఆల్‌ ద బెస్ట్‌ అరియానా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కుమ్మేసేయ్‌. ఆమె కోసం వెయిట్‌ చేయండి' అంటూ అరియానా బిగ్‌బాస్‌ బజ్‌ హోస్ట్‌గా రాబోతోందని చెప్పకనే చెప్పేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement