Bigg Boss 5 Telugu: ఫస్ట్‌ వీక్‌ నామినేట్‌ అయిన ఆ ఆరుగురు!

Bigg Boss 5 Telugu: Six Contestants Nominated 1st Week, List Inside - Sakshi

Bigg Boss 5 Telugu 1st Week Nominations: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి రోజే కంటెస్టెంట్లకు నిద్ర లేకుండా చేశాడు లోబో. తన గురకతో హౌస్‌మేట్స్‌ అందరినీ నిద్రకు దూరం చేశాడు. అతడి గురకను ఆపడానికి రవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరోవైపు అదే రాత్రి తమకు బోర్‌ కొడుతోందంటూ దొంగతనానికి పూనుకున్నారు సిరి హన్మంత్‌, జెస్సీ. కంటెస్టెంట్ల వస్తువులను దాచేసి తర్వాత నిమ్మకు నీరెత్తనట్లు ఊరకుండిపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కి ఆరుగురు నామినేట్‌ అయ్యారు. ఆ ఆరుగు ఎవరు? తొలి రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి.

దొంగతనం చేశామని ఒప్పుకున్న సిరి
ఇక తర్వాతి రోజును ఉరకలెత్తించే డ్యాన్స్‌తో ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఆ తర్వాత ఇయర్‌ రింగ్స్‌ పోయాయని ఒకరు, చెప్పులు పోయాయని మరొకరు గోల పెట్టినా అసలు దొంగలు మాత్రం చీమ కుట్టనట్లు ఉండిపోయారు. అయితే యాంకర్‌ రవి మాత్రం జెస్సీనే దొంగ అని ముందుగానే పసిగట్టడంతో సిరి తామే దొంగలమని ఒప్పుకోక తప్పుకోలేదు.

మూడున్నరేళ్ల నుంచి మోసం చేస్తున్నా..
ఇక ప్రియాంక సింగ్‌ తాను అతడు నుంచి అమ్మాయిగా మారేందుకు చేసుకున్న ఆపరేషన్‌ గురించి ఆర్జే కాజల్‌తో మాట్లాడింది. ఈ విషయంలో మూడున్నరేళ్ల నుంచి మా నాన్నను మోసం చేస్తున్నానని చెప్తూ ఎమోషనల్‌ అయింది. ఒకసారి తను నన్ను ముట్టుకుని గడ్డాలు, మీసాలు ఏవని అడిగితే లేడీ గెటప్‌ కోసం తీసేయించుకున్నానని అబద్ధం చెప్పానంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చింది కాజల్‌.

చెత్తకుండీలో కంటెస్టెంట్ల ఫొటోలు
అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలివారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు నామినేట్‌ చేయాలనుకున్నవారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేయాలి. ముందుగా సింగర్‌ శ్రీరామచంద్ర.. మానస్‌, జెస్సీలను నామినేట్‌ చేశాడు. సరయూ.. ఆర్జే కాజల్‌, యాంకర్‌ రవిని; శ్వేత వర్మ.. హమీదా, నటరాజ్‌ మాస్టర్‌ను, జెస్సీ.. విశ్వ, హమీదాను; ఉమాదేవి.. కాజల్‌, జెస్సీలను నామినేట్‌ చేశారు.

చదవండి: Bigg Boss 5 Telugu: నాగ్‌ పారితోషికం ఎంతో తెలుసా?

యాంకర్‌ రవికి కౌంటరిచ్చిన నటరాజ్‌ మాస్టర్‌
ఇక బిహేవియర్‌ నచ్చలేదని జెస్సీని, అందరితో క్లోజ్‌ అవ్వాలంటూ మానస్‌ను నామినేట్‌ చేశాడు విశ్వ. తనకు కాంపిటీషన్‌గా వస్తుందని సిరిని, కోపం తగ్గించుకోవాలంటూ జెస్సీని నామినేట్‌ చేసింది యానీ మాస్టర్‌. బయట ఉన్నట్లుగా హౌస్‌లో లేడని నటరాజ్‌ మాస్టర్‌ను, రిలాక్స్‌గా ఉంటున్నాడని మానస్‌ను నామినేట్‌ చేశాడు రవి. అయితే తనకు నటించడం రాదని రవికి గట్టి కౌంటరిస్తూనే అతడిని నామినేట్‌ చేశాడు నటరాజ్‌ మాస్టర్‌. అమాయకత్వంతో ఈ హౌస్‌లో ఉండలేవంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. ఫస్ట్‌ వీక్‌లోనే అందరూ నామినేట్‌ చేస్తుండటం, అందులోనూ వాళ్లు చెప్పే కారణాలను జీర్ణించుకోలేకపోయిన జెస్సీ అందరిముందే ఏడ్చేశాడు.

కళ్లల్లోకి కళ్లు పెట్టి చూశాడని రవిని నామినేట్‌ చేసిన లోబో
రూడ్‌గా మాట్లాడుతుందని లహరిని, తనను కామెంట్‌ చేశాడని జెస్సీని నామినేట్‌ చేసింది హమీదా. తనకు టాస్క్‌లు ఆడమని చెప్పడం నచ్చలేదని సన్నీని, ఎక్కువగా జోక్యం చేసుకోవడం నచ్చదని లోబోను నామినేట్‌ చేశాడు షణ్ముఖ్‌. యాటిట్యూడ్‌ చూపించిందని ప్రియను, యాపిల్‌ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్‌ చూపించాడని రవిని నామినేట్‌ చేశాడు లోబో.

మొదటి వారం నామినేట్‌ అయిన ఆరుగురు
మానస్‌.. విశ్వ, సరయూ; సిరి.. హమీదా, ప్రియను; సన్నీ.. షణ్ముఖ్‌, లహరిని; ప్రియాంక సింగ్‌.. షణ్ముఖ్‌, హమీదాలను; ప్రియ.. సిరి, కాజల్‌ను; మానస్‌.. విశ్వ, సరయూలను; కాజల్‌.. సరయూ, ఉమాదేవిని; లహరి.. హమీదా, కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో మొదటివారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తైంది. ఎక్కువగా ఓట్లు పడిన రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఈవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. మరి వీరిలో ఎలిమినేషన్‌ గండం గట్టెక్కేది ఎవరనేది చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-09-2021
Sep 07, 2021, 23:50 IST
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా...
07-09-2021
Sep 07, 2021, 20:34 IST
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయి....
07-09-2021
Sep 07, 2021, 19:31 IST
అతి సర్వత్రా వర్జయేత్‌ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే...
07-09-2021
Sep 07, 2021, 18:28 IST
బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐదు రెట్ల ఫన్‌,...
07-09-2021
Sep 07, 2021, 17:31 IST
సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని...
07-09-2021
Sep 07, 2021, 16:24 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కొట్లాటలు సర్వసాధారణం. కానీ మొదటిరోజే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం మాత్రం...
07-09-2021
Sep 07, 2021, 15:00 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19...
06-09-2021
Sep 06, 2021, 21:20 IST
గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో డబ్బులు... ...
06-09-2021
Sep 06, 2021, 20:02 IST
బోర్‌డమ్‌ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ...
06-09-2021
Sep 06, 2021, 18:59 IST
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు...
06-09-2021
Sep 06, 2021, 18:07 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌ కళకళలాడిపోతోంది. వీళ్లు హౌస్‌లోకి అడుగుపెట్టారో లేదో...
06-09-2021
Sep 06, 2021, 13:54 IST
Lobo Controversial Comments On Bigg Boss Reality Show:  టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది...
05-09-2021
Sep 05, 2021, 21:51 IST
Anchor Ravi In Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు...
05-09-2021
Sep 05, 2021, 21:46 IST
Sweta Varma In Bigg Boss 5 Telugu: శ్వేత వర్మ ముక్కుసూటి మనిషి. ఎంత అందంగా ఉంటుందో అంత...
05-09-2021
Sep 05, 2021, 21:34 IST
'కోరుకున్నవాడి చేయందుకుని చెంతకు చేరిన సంతోషం ఓ కంట ఆనంద భాష్పాలను కురిపిస్తుంటే ఉపాధి చాలని ఆకలిచూపులు మరో కంట...
05-09-2021
Sep 05, 2021, 21:26 IST
బాల నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు మానస్‌. సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజ్‌...
05-09-2021
Sep 05, 2021, 21:22 IST
అనేక సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది ఉమాదేవి. కెరీర్‌లో...
05-09-2021
Sep 05, 2021, 21:15 IST
'వచ్చిన ప్రతీ అవకాశాన్ని నిచ్చెనగా చేసుకుని ఒక్కో మెట్టు ఎదగడం మొదలుపెట్టాను. ఉక్కులు కరిగించే నిప్పుల సెగను ఊపిరిగా చేసుకుని,...
05-09-2021
Sep 05, 2021, 20:58 IST
ప్రత్యేక యాసతో ఉన్నదున్నట్లు మాట్లాడే సరయూ గురించి యూట్యూబ్‌ వీక్షకులకు తెలిసే ఉంటుంది. తను 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌...
05-09-2021
Sep 05, 2021, 20:49 IST
కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌ తెలుగులో వస్తున్న డ్యాన్స్‌ రియాలిటీ షోలకు ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్‌ బేబీ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top