Bigg Boss 5 Telugu Contestants Hamida:‘ శ్రీరామ్‌ నా మనుసులో ఉంటాడు’

Bigg Boss 5 Telugu: Hamida Interesting Comments On Sreerama Chandra - Sakshi

Hamida About Sreerama Chandra: బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ అనేది తప్పకుండా ఉంటుంది. హౌజ్‌లోని ఈ లవ్‌ ట్రాక్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్‌లో అయితే ఏకంగా ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడిచింది. మోనాల్‌-అఖిల్‌- అభిజిత్‌ మధ్య జరిగిన లవ్‌ట్రాక్‌ బిగ్‌బాస్‌ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సీజన్‌లో కూడా శ్రీరామ్‌, హమిద మధ్య లవ్‌ ట్రాక్‌ బాగానే నడిచింది. కానీ అనుకోకుండా హమిద గతవారం ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో అలరించబోయే చిత్రాలివే..

అయినప్పటికీ ఆమె శ్రీరామ్‌ని మర్చిపోలేకపోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌  చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ శ్రీరామ్‌, తనకు మధ్య అద్భుతమైన బంధం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘శ్రీరామ్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. ఈ బాండింగ్‌, జీవితంలో ప్రేమ కోసం వేతుకుతున్న నాకు బిగ్‌బాస్‌లోకి వచ్చే అవకాశం వచ్చింది. అక్కడ నాకు శ్రీరామ్‌ పరిచయం ఎంతో అనుభూతిని ఇచ్చింది.

చదవండి: శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి 

అది స్నేహమా, ప్రేమ అని చెప్పలేను. కానీ మా మధ్య మంచి బాండింగ్‌ ఎర్పడింది. శ్రీరామ్‌ ఎప్పుడు నా మనసులో ఉంటాడు. అది ఏదైనా కానీ ఇది ఒక అద్భుతమైన బంధం. చాలా బాగుంది’ అంటూ మనసులోని మాటను బయటక పెట్టింది. అలాగే తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చూశానని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది. అయితే తను సినీ ఇండస్ట్రీకి రావడం మొదట్లో తన తండ్రికి అసలు నచ్చలేదని, కానీ ఇప్పుడు తనని చూసి ఆయన గర్వపడుతున్నారంటూ హమిదా ఆనందం వ్యక్తం చేసింది.  కాగా హమిదా కలకత్తాకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె తెలుగు బాగా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. 

చదవండి: Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top