బిగ్‌బాస్‌: మోనాల్‌కు అబిజిత్ కౌంట‌ర్‌

Bigg Boss 4 Telugu: Triangle Love Story Among Abhijeet, Monal And Akhil - Sakshi

బిగ్‌బాస్ అంటేనే కోపాలు, క‌లిసిపోవ‌డాలు, చిరాకులు, చిలిపి చేష్ట‌లు, ప్రేమ‌లు, ప‌ట్టింపులు, టాస్కులు, ట‌ఫ్ ఫైట్లు అన్నీ ఉంటాయి. కానీ మొద‌టి వారంలో అన‌వ‌స‌ర‌మైన వాటికే అతిగా ఆవేశ‌ప‌డ‌టం క‌నిపించింది. అయితే ఇప్పుడిప్పుడే మిగిలిన ఎమోష‌న్స్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నిన్న‌టి ఎపిసోడ్‌లో హారిక‌కు అభిజిత్  అంటే ఇష్ట‌మ‌ని తేలిపోయింది. ఎంత ఇష్టం లేక‌పోతే హారిక‌ అత‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ గోరు ముద్ద‌లు తినిపిస్తుంది. కానీ వీరిది స్నేహమేన‌ని భావిస్తున్నారు. ఎందుకంటే అభిజిత్‌కు మోనాల్ అంటే మ‌రీ మ‌రీ ఇష్టం.

అప్పుడు లైట్‌.. ఇప్పుడు క్లోజ్‌
మొద‌ట్లో ఆమెను ప‌ట్టించుకోన‌ట్లు క‌‌నిపించినా ఇప్పుడు ఆమెను వ‌దిలి ఉండ‌లేక‌పోతున్నాడు. త‌న‌తో మాట్లాడంటూ ఒట్టేయ‌మ‌ని మోనాల్‌ను అభ్య‌ర్థించాడు. ఎవ‌ర్నీ ప్రేమించ‌ట్లేదు క‌దా అని మ‌న‌సులోని భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. అందుకు ఆమె అలాంటిదేం లేద‌ని చెప్ప‌డంతో అత‌ని మ‌న‌సు తేలిక‌ప‌డింది. ఇప్పుడు ఆమెతో ఇంకా క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే స్టైలింగ్ ఐకాన్ అఖిల్ కూడా మోనాల్‌తో ముచ్చ‌టించేందుకు స‌మ‌యం కేటాయిస్తున్నాడు. ఆమెకు గోరుముద్ద‌లు తినిపిస్తూ క్లోజ్‌గా ఉంటున్నాడు. కానీ ఇది అభిజిత్‌కు ఏమాత్రం న‌చ్చ‌ట్లేద‌ని అత‌డి ముఖం చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య మోనాల్ న‌లిగిపోతోంది. (చ‌ద‌వండి: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్లే)

అభి ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌ని అఖిల్‌
తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో.. "సాధార‌ణంగా స్నేహితుల‌ను, పార్ట్‌న‌ర్స్‌ను మ‌న‌మే ఎంపిక చేసుకుంటాం, కానీ ఇక్క‌డ అలా జ‌ర‌గ‌దు" అంటూ మోనాల్ తినుకుంటూ ముచ్చ‌ట్లు చెప్తుంది. అందుకు అభి బ‌దులిస్తూ నువ్వేమైనా స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు నీ క్లాస్‌మేట్‌ను నువ్వే సెల‌క్ట్ చేసుకున్నావా? అని కౌంట‌ర్ వేస్తాడు. అప్పుడే మోనాల్‌కు ద‌గ్గు రావ‌డంతో అభి వెంట‌నే నీళ్లు తీసుకు రావ‌డానికి వెళ్తాడు. కానీ వీరికి‌ దూరంలో ఉన్న అఖిల్ మాత్రం బాటిల్ నింపుకుని ఆమెకు ఇచ్చేస్తాడు. 'నీళ్లు ఇస్తున్నావా?' అని అభి అడిగినా స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లిపోతాడు. (చ‌ద‌వండి: రొమాంటిక్ డ్యాన్స్‌; క‌ళ్లు మూసుకున్న అరియానా)

ఇదంతా బిగ్‌బాస్ డ్రామానే
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు నానా ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. మోనాల్ అంత చిన్న‌గా ద‌గ్గినా కూడా అఖిల్‌కు వినిపించిందా? అంటే వీళ్లేం మాట్లాడుకుంటున్నారనేది అత‌డు వింటున్నాడ‌ని అంటున్నారు. క‌నీసం అభి అడిగిన‌ప్పుడు స‌మాధానం చెప్పొచ్చు క‌దా అని విమ‌ర్శిస్తున్నారు. అస‌లు అభిజిత్‌-మోనాల్‌-అఖిల్ మ‌ధ్య న‌డుస్తున్న‌ ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ నిజ‌మా లేక బిగ్‌బాస్ క్రియేట్ చేశాడా? అని చాలామంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రేమ క‌థ ఇంకా ఎంత‌దూరం వెళుతుందో చూద్దామ‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇది అచ్చంగా ఆర్య సినిమాను గుర్తు చేస్తోందంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఎప్పుడూ వీళ్ల ప్రేమ‌ గొడ‌వేనా, కాస్త‌ మంచి టాస్కులు ఆడించ‌డంపై ఫోక‌స్ చేయండ‌ని బిగ్‌బాస్‌కు మొట్టికాయ‌లు వేస్తున్నారు. (చ‌ద‌వండి: నిన్ను చూస్తే పులిహోర క‌ల‌ప‌డం వ‌చ్చిన‌ట్లుందే: దివి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-09-2020
Sep 25, 2020, 23:20 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో వారానికో వైల్డ్ కార్డ్ ఎంట్రీ న‌డుస్తోంది. మొద‌టి వారం క‌మెడియ‌న్‌, న‌టుడు కుమార్ సాయి హౌస్‌లో...
25-09-2020
Sep 25, 2020, 19:57 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఇచ్చిన "ఉక్కు హృద‌యం" టాస్క్ వ‌ల్ల‌ హౌస్ ఎంత ర‌సాభాస‌గా మారిందో తెలిసిందే క‌దా. అయితే...
25-09-2020
Sep 25, 2020, 19:02 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ప్రేక్ష‌కులు అతి చేసేవాళ్ల‌ను మెచ్చ‌డం లేదు. ఇంటి స‌భ్యులంద‌రినీ నోరెత్త‌కుండా, త‌న మాటే వేదంలా ఆచ‌రించాల‌నేట్టు...
25-09-2020
Sep 25, 2020, 15:56 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ ఇప్పుడిప్పుడే ఇంట్ర‌స్టింగుగా మారింద‌నుకుంటున్న స‌మ‌యంలో బిగ్‌బాస్ ఆ పేరును చెగ‌డొట్టేలా ఉన్నాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం...
24-09-2020
Sep 24, 2020, 23:10 IST
బుద్ధి బ‌లం ముందు కండ‌బ‌లం ఓడిపోయింది. ఎత్తుకు పై ఎత్తులు, పోట్లాట‌లు, కొట్లాట‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు రోబోల టీమ్ గెలుపును...
24-09-2020
Sep 24, 2020, 20:38 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ ఎంత గ్రాండ్‌గా ప్రారంభ‌మైందో ప్రేక్ష‌కులు కూడా అంతే గ్రాండ్‌గా వెల్‌క‌మ్ చెప్పారు. అస‌లే ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌రువు కాలంలో...
24-09-2020
Sep 24, 2020, 18:02 IST
ఇంటి స‌భ్యుల క‌సి చూస్తుంటే బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజిక‌ల్ టాస్క్ ఇప్ప‌ట్లో పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఓవైపు నిద్రాహారాలు మాని...
24-09-2020
Sep 24, 2020, 17:14 IST
"బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రూ స‌మాన‌మే". గ‌త మూడు సీజ‌న్ల నుంచి వ‌స్తున్న ఈ నియ‌మాన్ని ఈ సీజ‌న్‌లో గాలికొదిలేసిన‌ట్లు క‌నిపిస్తోంది....
24-09-2020
Sep 24, 2020, 15:47 IST
బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన‌ 'ఉక్కు హృద‌యం' టాస్క్‌లో అనేక‌ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఒక్క టాస్క్ ఇంటి...
23-09-2020
Sep 23, 2020, 23:17 IST
నిన్న అస‌లు గేమే ఆడ‌ని అభిజిత్‌కు నేడు మెద‌డు పాద‌ర‌సంలా ప‌ని చేసింది. అత‌డు చెప్పిన కిడ్నాప్ ప్లాన్ బాగా...
23-09-2020
Sep 23, 2020, 15:36 IST
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అస‌లు ఎత్తుగ‌డ‌లు నేడు మొద‌లు కానున్నాయి. టాస్క్ కోసం ఎంత‌కైనా తెగించేందుకు రెండు టీమ్‌లు హోరాహోరీగా...
23-09-2020
Sep 23, 2020, 08:50 IST
డ్యాన్స్‌పై ఉన్న ప్యాషన్‌.. టీవీలో చూసి స్టెప్పులు నేర్పింది. యాక్టర్‌ అవ్వాలనే ఆకాంక్ష.. తొలిసారి కాలేజీ స్టేజీపైకి ఎక్కించింది. స్క్రీన్‌పై కనిపించాలనే...
22-09-2020
Sep 22, 2020, 23:19 IST
అస‌లే నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో మంట మీదున్న కంటెస్టెంట్లు నేటి టాస్క్‌లో త‌మ స‌త్తా ఏంటో చూపించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ఫిజిక‌ల్ టాస్క్...
22-09-2020
Sep 22, 2020, 18:22 IST
ఫిజిక‌ల్ టాస్క్ అంటేనే ఎవ‌రి శ‌క్తి ఏంటో చూపించుకునే ఓ అవ‌కాశం. కానీ ఇదే టాస్క్‌లో వాదులాడుకోవ‌డాలు, కొట్టుకోవ‌డాలు, తోసుకోవడాలు...
22-09-2020
Sep 22, 2020, 16:32 IST
రోజులు గ‌డిచే కొద్దీ బిగ్‌బాస్ షో కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. అయితే బిగ్‌బాస్ ఆద‌ర‌ణ‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ గండి...
22-09-2020
Sep 22, 2020, 15:40 IST
మొన్న‌టివ‌ర‌కు సంక్రాంతి సినిమాను త‌ల‌పించిన బిగ్‌బాస్ హౌస్ నిన్న‌న‌టి నామినేష‌న్ ఎపిసోడ్‌తో ర‌ణ‌రంగంగా మారిపోయింది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో అంద‌రి రంగులు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, ఎవ‌రేంటో...
21-09-2020
Sep 21, 2020, 23:07 IST
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా ఆరంభమై బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఆది నుంచి...
21-09-2020
Sep 21, 2020, 17:17 IST
బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌‌ సీజన్‌ 4.. ఆదివారంతో రెండు వారాలను పూర్తి...
21-09-2020
Sep 21, 2020, 15:30 IST
కరోనా లాక్ డౌన్ అనంతరం మొదలైన బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీన్ని ప్రసారం...
20-09-2020
Sep 20, 2020, 23:04 IST
లీకు వీరులు చెప్పిన‌దానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. కాక‌పోతే హారిక‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌కుండా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top