వారం రోజుల‌కు ల‌క్ష‌ల్లో ఇచ్చారు

Bigg Boss 4 Telugu: Surya Kiran Talk About His Remuneration - Sakshi

తెలుగు బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో రెండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు సూర్య‌కిర‌ణ్‌. కానీ క‌టువుగా మాట్లాడే వైఖ‌రి వ‌ల్ల మొద‌టివార‌మే ఎలిమినేట్ అయ్యాడు. బ‌య‌ట చేసే డైరెక్ష‌న్ ఇంట్లోనూ చేయ‌డం వ‌ల్లే అత‌ను తిరుగుముఖం ప‌ట్టాల్సి వ‌చ్చింద‌ని ప్రేక్ష‌కుల అభిప్రాయం. తాజాగా ఆయ‌న బిగ్‌బాస్ షో గురించి, వాళ్లిచ్చే రెమ్యూన‌రేష‌న్ గురించి మాట్లాడాడు ఈ మేర‌కు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. క‌ళ్యాణిని ఇత‌ర ఇంటి స‌భ్యులు ఆడుకుంటున్నా, అది ఆమెకు అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇక‌ మొద‌టి వారంలో ప్రేమ‌లేవీ చిగురించ‌లేవంటూనే అభిజిత్‌‌, మోనాల్‌, అఖిల్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుంద‌ని తెలిపాడు. దీని గురించి ఇంట్లో నుంచి వ‌చ్చేముందు మోనాల్‌ను హెచ్చ‌రించాన‌న్నాడు. (బిగ్‌బాస్‌: చీపురుతో చిత‌క్కొట్టిన గంగ‌వ్వ‌)

అంద‌రికీ బాగానే ఇచ్చారు
"రెమ్యూన‌రేష‌న్ ఎంత ఇచ్చార‌నేది చెప్పొచ్చో, లేదో నాకు తెలీదు. కానీ నాకైతే చాలానే ఇచ్చారు. అడిగిన దానికి 10 రెట్లు ఎక్కువే స‌మ‌ర్పించుకున్నారు. ఒక్క వారం రోజులు ఉన్నందుకు ల‌క్ష‌ల్లో ఇచ్చారు. ఈ డ‌బ్బుతో ఐదారు నెల‌లు కులాసాగా బతికేయొచ్చు. నాకొక్క‌రికి మాత్ర‌మే కాదు, అంద‌రికీ బాగానే ఇచ్చారు. నిజానికి ఒక వార‌మే క‌దా ఉన్న‌ది.. ఏమైనా ఇస్తారా అని కొంత అడిగితే, ఇచ్చేది చాలా వుందంటూ పెద్ద మొత్తంలో స‌ర్దారు. ఇక హౌస్‌లో కూడా ఉండాల‌ని అనిపించ‌లేదు. కానీ తొలివారం ఎలిమినేష‌న్ ఉండ‌ద‌నుకున్నాను. ఇక‌పోతే అమ్మ రాజ‌శేఖ‌ర్ జెన్యూన్ ప‌ర్స‌న్, నాలాంటి వాళ్లు ఒకరు లోప‌ల అత‌డికి సాయంగా ఉంటే బాగుండు. లేదంటే హౌస్‌లో ఉన్న‌వాళ్లు ఆయ‌న‌పై ఎ‌క్కేస్తారు. హౌస్‌లో అమాయకులు ఎవ‌రూ లేరు" అ‌ని సూర్య‌కిర‌ణ్ స్ప‌ష్టం చేశాడు. (ఓ మూడు నాలుగు వారాలు ఉందామనుకున్నా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top