బిగ్‌బాస్‌: అవినాష్‌కు నాగ్‌ ఊహించని గిఫ్ట్‌ | Bigg Boss 4 Telugu: Nagarjuna Surprise Gift To Avinash | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అవినాష్‌కు నాగ్‌ ఊహించని గిఫ్ట్‌

Dec 11 2020 7:20 PM | Updated on Dec 12 2020 12:08 AM

Bigg Boss 4 Telugu: Nagarjuna Surprise Gift To Avinash - Sakshi

చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కి కామెడీ టచ్‌ ఇచ్చి ఆసక్తికరంగా మార్చిన ఒకే ఒక వ్యక్తి అవినాష్‌. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చి అందరిని తన కామెడీ తో ఆకట్టుకున్నాడు. తనదైన మార్క్ కామెడీతో హౌస్ లో నవ్వులు పూయించాడు. చివరకు నాగార్జున కూడా అవినాష్‌ కామెడీకి ఫిదా అయ్యాడు. ప్రతి శని, ఆదివారాల్లో నాగ్ నోట అవినాష్‌ పేరే ఎక్కువసార్లు వచ్చేంది. కామెడీతో పాటు టాస్క్‌లు కూడా అవినాష్‌ బాగానే చేశాడు.

బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా స్టేజ్ పై నవ్వులు పూయించాడు అవినాష్. బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో  బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవినాష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో నాగార్జున వేసుకున్న షర్ట్ బాగుందని అవినాష్ అన్నాడు. అది గుర్తుపెట్టుకొని మరీ నాగార్జున ఆ షర్ట్ ను అవినాష్ ఇంటికి పంపించాడు. నాగ్ పంపిన స్పెషల్ గిఫ్ట్ తో అవినాష్ పట్టలేని ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాద్వారా తెలిపాడు.  అంతేకాకుండా ఆషర్ట్ వేసుకొని దిగిన ఫోటోను కూడా షేర్ చేసాడు.

Advertisement
 
Advertisement
Advertisement