సోనూసూద్‌, మోనాల్‌కు స‌పోర్ట్ చేయండి

Bigg Boss 4 Telugu: Monal Gajjar Fans Request To Sonu Sood - Sakshi

తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌వుతానంటూ బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంటు మోనాల్ గ‌జ్జ‌ర్ మీద ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఓ ర‌కంగా ఆమెపై విద్వేష‌పూరితంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్నారు. ఆమె క్యారెక్ట‌ర్ మీద నింద వేస్తూ భ‌విష్యత్తును అంధ‌కారం చేస్తున్నారు. నిజానికి మోనాల్ అంత పెద్ద‌ త‌ప్పేమీ చేయ‌లేదు. ఆమె వృత్తి రీత్యా హీరోయిన్.. అయినా స‌రే వార‌మంతా సాధార‌ణ దుస్తుల్లోనే క‌నిపించిన‌ప్ప‌టికీ, వీకెండ్‌లో మాత్రం కాస్త‌ ఎక్స్‌పోజింగ్ ఉండే బ‌ట్ట‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చేది. దాన్నో ఘోర‌ నేరంలా చాలా మంది త‌ప్పుప‌ట్టారు. ఇక రెండోది ఆమె అభిజిత్‌, అఖిల్ ఇద్ద‌రినీ ఫ్రెండ్ అని భావించింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్)

మోనాల్‌పై లెక్క‌లేన‌న్ని అభాండాలు
అఖిల్‌కు తొంద‌ర‌గా ప‌డుకునే అల‌వాటు ఉండేది. దీంతో రోజంతా అఖిల్‌తో మాట్లాడినా, రాత్రి అభిజిత్‌తో క‌బుర్లు చెప్పేది. కానీ ఇది జ‌నాలకే కాదు, తోటి కంటెస్టెంట్ల‌కు కూడా వేరేలా అర్థ‌మైంది. ఇక‌ గుజ‌రాతీ అమ్మాయి కావ‌డంతో వ‌చ్చీరాని తెలుగుతో పాటు హిందీలో ఎక్కువ‌గా మాట్లాడేది. దీంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె మ‌రింత దూర‌మైంది. ఇంకా అబ‌ద్ధాల కోరు అని, కెమెరాల ముందు న‌టిస్తోంద‌ని ఇలా ఎన్నో అభాండాలు ఉండ‌నే ఉన్నాయి. లేని పోని నింద‌లు వేస్తూ మోనాల్‌ను దారుణంగా అవ‌మానించ‌డాన్ని ఆమె అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో మోనాల్‌ను కాపాడ‌మ‌ని సోనూసూద్‌ను వేడుకుంటున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ ఇంటిని వీడనున్న మోనాల్‌!)

వివ‌క్ష‌కు గుర‌వుతున్న ఆమెకు స‌పోర్ట్ చేయండి
"ప్రియ‌మైన సోనూ సూద్ స‌ర్‌, మీకు మోనాల్ గ‌జ్జ‌ర్ తెలిస్తే ద‌య‌చేసి ఆమెకు స‌పోర్ట్ చేయండి. ఓట్ల కోస‌మో, ఆమెను సేవ్ చేయ‌డం కోస‌మే మిమ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌మ‌న‌ట్లేదు. గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన ఆమెను ఇక్క‌డ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీచంగా మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. కానీ ఇదివ‌ర‌కే మోనాల్ మీకు ప‌రిచ‌యం ఉంటే త‌న‌ను దుష్ప్ర‌చారం నుంచి కాపాడండి. వేరే రాష్ట్రం నుంచి వ‌చ్చింద‌ని ఆమెకు స‌పోర్ట్ చేయ‌న‌క్క‌ర్లేద‌ని వివ‌క్ష చూపుతున్నారు. ఇంత వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసిన‌ క్ష‌ణం ఆమెకు ఏమవుతుందోన‌ని భ‌యంగా ఉంది. ప్లీజ్‌, మీరు ఆమెకు మ‌ద్ద‌తు తెల‌పండి" అంటూ సోనూ, మోనాల్ క‌లిసి దిగిన ఫొటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ‌ వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనిపై సోనూ స్పందిస్తాడో లేదో చూడాలి!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top